DNB News - తెలంగాణ / : తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామం సమీపంలో ఉన్న జియో మైసూర్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోల్డ్ మైన్స్‌ను జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి సందర్శించారు. ఈ సందర్భంగా గనుల తవ్వకాల విధానం, భద్రతా ప్రమాణాలు, కార్మికులకు అందిస్తున్న సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలపై కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. గనుల్లో భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని, కార్మికుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే, గనుల కార్యకలాపాలు స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా నిర్వహించాలని, పర్యావరణానికి హాని కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
DNB News