DNB News - తెలంగాణ / : మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో కోదాడ ఎమ్మెల్యే యన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి మంజూరైన 5 లక్షల వ్యయం తో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సీసీ రోడ్డు మంజూరు చేసిందని తెలిపారు. పనులు సకాలంలో నాణ్యతతో చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని వారు అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మాతంగి బసవయ్య, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొలిశేట్టి బుచ్చి పాపయ్య, మండల ఉప సర్పంచ్ వట్యావుల సైదులు, వార్డు సభ్యులు దేశగాని లింగమ్మ, కందుల లింగయ్య,జిల్లేపల్లి సుమన్, పార్టీ నాయకులు లక్యా నాయక్, సుదీర్ రెడ్డి, గట్టు ఉపేందర్ రావు, మునుకుంట్ల శీను, గురుస్వామి, వెంకటేశ్వర్లు,వెంకటయ్య, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News