Tuesday, 28 April 2026 04:13:54 PM
# పేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి # మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం # దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం

హైదరాబాద్‌లో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు..

Date : 25 April 2026 03:08 PM Views : 13

DNB News - తెలంగాణ / : తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుంది. శుక్రవారం హైదరాబాద్‌లో పోలీస్ ఉన్నతాధికారుల ఎదుట 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న 34 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వారిని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మరికాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. లొంగిపోయి మావోయిస్టులంతా ఛత్తీస్‌గఢ్ వాసులేనని పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబర్‌లో 41 మంది మావోయిస్టులు.. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మావోయిస్టు అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నరసింహా రెడ్డి అలియాస్ గంగన్న సైతం లొంగిపోయారు. ఈ నెల రెండో వారంలో దాదాపు 30 మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. తాజాగా మరో 47 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో అత్యధికులు ఛత్తీస్‌గఢ్ వాసులే కావడం గమనార్హం. దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ ‘ఆపరేషన్ కగార్‌’ను తెరపైకి తీసుకు వచ్చింది. ఈ ఏడాది మర్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ప్రభావిత రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు నిరంతరం కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య పలు ఎన్‌కౌంటర్లు జరిగాయి. వీటిలో వందలాది మంది మావోయిస్టులు మరణించారు. వేలాది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. భారీగా మావోయిస్టులను అరెస్ట్ చేశారు. దీంతో మావోయిస్టుల సంఖ్య దేశంలో దాదాపుగా తగ్గిపోయింది..!!

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :