DNB News - తెలంగాణ / : రాష్ట్ర పెన్షనర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఇల్లందు మండలంలో నిరసన దినోత్సవం జరిపి ఇల్లందు తహసీల్దార్ కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్ లకు నష్టం వాటిల్ల జేసే పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ ను ఉపసంహారించాలని కోరుతూ, పెన్షన్ దారులందరికి ఆరోగ్య కార్డులు ఉచితంగా పంపిణీ చేయాలనీ, బకాయి పడ్డ DA లను వెంటనే విడుదల చేయాలనీ, PRC రిపోర్ట్ ను తెప్పించుకొని వెంటనే అమలు చేయాలనీ కోరుతూ స్థానిక పెన్షన్ భవన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ గారి ద్వారా ప్రధాన మంత్రి గారికి వినతిపత్రం పంపించడం జరిగింది. మండల అధ్యక్షులు శ్రీ D స్వామిదాస్ గారు ఈ యాక్ట్ ను అమలు చేయడం వలన పెన్షన్ దారులకు జరిగే నష్టాలను వివరించారు ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి శ్రీ MM చారి గారు, ఆర్థిక కార్యదర్శి Ch రమేష్, కార్యదర్శులు రాంబాబు, ముత్తయ్య, రామ్మూర్తి, లక్ష్మయ్య, కృష్ణప్రసాద్, రాజయ్య, భావనారాయణ, విజయకుమార్, సుధాకర్, రాజమణి,లక్ష్మి, రాధ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News