Friday, 19 June 2026 01:59:37 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలి కానీ సమస్యలు సృష్టించకూడదు

Date : 24 April 2026 10:04 AM Views : 41

DNB News - తెలంగాణ / : హుజురాబాద్ రూరల్ మండలం సిర్సపల్లి శివారులో దాదాపు 125 ఎకరాలలో నాలుగు జిల్లాలకు సంబంధించిన చెత్తను ఇక్కడ డంపింగ్ చేయడానికి యార్డు ఏర్పాటు చేస్తే , చుట్టుపక్క గ్రామాలు, హుజురాబాద్ ప్రజలకు, ఈ ప్రాంత భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని, ప్రభుత్వం నాలుగు జిల్లాల చెత్తతో ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి హుజురాబాద్ భవిష్యత్తును బొంద పెడతారా అని బిజెపి శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. గురువారం రోజున బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, హుజురాబాద్ బిజెపి నేతలతో కలిసి ఎమ్మెల్సీ అంజిరెడ్డి డంపింగ్ యార్డ్ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరికాదని, ప్రజల అభీష్టానికి అనుగుణంగా పనిచేయాల్సిన ప్రభుత్వం తమకు తోచినట్టు వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. నాలుగు జిల్లాల చెత్తను తీసుకొచ్చి ఒక్క ప్రాంతంలో వేస్తే ఇక్కడి ప్రజల పరిస్థితి ఏంటి.? వాళ్లు ఎలా జీవిస్తారు..? వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతుల పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటు విషయంలో మొండిగా నిర్ణయం తీసుకొని ఇక్కడి ప్రాంతంలో యార్డ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం భావ్యం కాదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ, కీడు, హాని తలపెట్టే కార్యక్రమాలు చేపట్టవద్దన్నారు. ప్రశాంతంగా ఉన్న హుజురాబాద్ ప్రాంత ప్రజలను బాధ పెడుతుందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం సమస్యలను సృష్టించడం సరికాదన్నారు.. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామనే ప్రకటన, నిర్ణయంతో హుజురాబాద్ ప్రాంతంలో నెల రోజులుగా గందరగోళ పరిస్థితులు వచ్చాయన్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వద్దని నెల రోజులుగా ప్రజలు ఆందోళలు నిరసన కార్యక్రమాలు, రిలే నిరాహార దీక్షలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మొండి వైఖరి తోనే ఉండడం సరికాదన్నారు.. ప్రజలంతా ఒక్కటై, అన్ని పార్టీలు ,అన్ని సంఘాలు ఒక్కటై జేఏసీగా ఏర్పడి ముక్తకంఠంతో నినదించిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని మార్చుకొని ,డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, డంపింగ్ యార్డ్ రద్దు ప్రకటన చేయాలన్నారు. విత్తన కేంద్రంగా ఉన్న ఈ హుజురాబాద్ ఏరియాలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బిజెపి హుజురాబాద్ పట్టణ, మండల అధ్యక్షులు, తుర్పాటి రాజు, పారిపెల్లి కొండాల్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, ఇళ్ళంతకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, కౌన్సిలర్స్,మొలుగురి సుమలత, పంజాల మనోజ్ దామర అనూష తూర్పాటి లక్ష్మీ దుర్గ కొండ ప్రశాంతి కందుగుల సర్పంచ్ ముప్పు మహేష్ బిజెపి సీనియర్ నాయకులు పైల్ల వెంకట్ రెడ్డి గంగిశెట్టి ప్రభాకర్ ,తూముల శ్రీనివాస్ ,నరాల రాజశకర్ తిప్పబతిని రాజు, యాంశాని శశిధర్, సబ్బని రమేష్, అనురాగ్,మంచికట్ల మురళీ, పడారి సుమన్, గంట సంపత్, కొలిపాక వెంకటేష్, ఇనుగొండ తిరుపతిరెడ్డి, వెంకట్రావు, బైరెడి సంపత్ రెడ్డి, సహదేవ్ క్యాస వెంకటేష్,ఎర్ర శ్రీదర్,నల్ల అజయ్,పడ్తం విజయ్, నగేష్,నాయకులు , కార్యకర్తలు తది తరులు పాల్గొన్నారు..

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: