Monday, 15 June 2026 01:40:56 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

హెల్త్ కమిషనర్ * కలిసిన శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ , సూపర్వైజర్ *SPS మెడికల్ & హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ :::::::: రాష్ట్ర

Date : 07 February 2026 03:37 PM Views : 295

DNB News - తెలంగాణ / : తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నందు పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నందు శానిటేషన్ , పేషెంట్ కేర్ , సెక్యూరిటీ గార్డ్స్ , సూపర్వైజర్స్ వ్యవస్థ ను IHFMS ( ఇంటిగ్రేడ్ హెల్త్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం ) ద్వారా కాకుండా ప్రభుత్వానికి గుర్తింపు పొందిన IFMS ( ఇంటిగ్రేడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం ) ద్వారా మా కార్మికుల అందరిని కలపాలి అని రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య గారు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నందు వచ్చిన పేషెంట్ కి ముందుగా సర్వీస్ అందించే పేషెంట్ కేర్ మా వ్యవస్థలో మనిషి పేషంటు ఆసుపత్రి సరౌండింగ్ లో ఏమైనా వాంతులు, విరోచనాలు చేసుకుంటే పరిశుభ్రపరిచే శానిటేషన్ వర్కర్ మా వ్యవస్థలోని మనిషి ప్రభుత్వ ఆసుపత్రి నందు మద్యం సేవించి దెబ్బలు తగిలించుకొని ఇష్టానుసారంగా గొడవలు చేస్తుంటే వారిని సముదాయించి ప్రభుత్వ ఆస్పటల్ ఆస్తులను ( పరికరాలు ) లకు రక్షణగా ఉండి డ్యూటీ చేసే సెక్యూరిటీ గార్డ్స్ మా వ్యవస్థలోనే మనిషి హాస్పటల్ సరౌండింగ్ మొత్తం మీద ఎక్కడ అయినా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని గుర్తించి వారి సిబ్బందితో అక్కడ ఉన్న ఆటంకములు మొత్తం క్లియర్ చేసే బాధ్యత తీసుకుంటున్న వ్యక్తి సూపర్వైజర్ మా వ్యవస్థలోని మనిషి ఇన్ని రకాలుగా ప్రభుత్వ ఆస్పటల్ నందు ఒక మనిషి పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు జరిగే చికిత్స ప్రతి విభాగంలో మా సిబ్బంది పని చేస్తున్నాము మా తర్వాతనే నర్సింగ్ ఆఫీసర్స్, డాక్టర్స్ పేషెంట్ దగ్గరికి వస్తుంటారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంటున్నా నిర్ణయంలో భాగంగా ఔట్సోర్సింగ్ & కాంటాక్ట్ కార్మికులకు నేరుగా వారి వారి ఎకౌంట్లో జీతభత్యాలు వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నందుకు చాలా సంతోషకరం కానీ అత్యవసర విభాగం నందు పనిచేస్తున్న మా యొక్క వ్యవస్థ ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరం మమల్ని కూడా నేరుగా ఇచ్చే వేతనములో లలో కలపాలి అని కుర్రి సైదయ్య అన్నారు. ప్రభుత్వం విధానంలో భాగంగా IFMS ద్వారా కార్మికులను తీసుకుంటుందో అట్టి విధానంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా కార్మికులను అందరిని కూడా 17,800 నుండి 18000 మంది కార్మికులను తీసుకోవాలి అని వారిని వారి కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలి అని అన్నారు గత 15 , 20 సంవత్సరాల నుండి హాస్పటల్లో పనిచేస్తూ వారి యొక్క ఆరోగ్యములు కూడా ఇబ్బందులు బారిన పడిన విధినిర్వాహణలో ఎటువంటి ఇబ్బందుల చేసిన మా కార్మికులను కూడా గుర్తించాలి అని అన్నారు. ఇట్టి విషయము అయి హెల్త్ కమిషనర్ Dr . A. అజయ్ కుమార్ గారిని కలిసి తమరి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా కార్మికులను మా కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని కోరినారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో పనిచేస్తున్న మా కార్మికులు ఇప్పటికే థర్డ్ పార్టీ ( బెడ్ సైడ్ ) కాంటాక్ట్ విధానంలో చాలా నష్టపోయామని తెలియపరిచారు. ఇకనైనా ఈ థర్డ్ పార్టీ ( బెడ్ సైడ్ ) కాంట్రాక్టు వ్యవస్థకు ఈ ప్రభుత్వం ద్వారా స్వస్తి పలకాలి అని కోరినారు. 1. ప్రతి కార్మికుడికి కనీస వేతనం ద్వారా 26000/- కల్పించాలి 2. ప్రతి కార్మికుడికి ఈపీఎఫ్ & ఈఎస్ఐ ప్రభుత్వం నామ్స్ ద్వారా కట్టాలి 3. విధి నిర్వహణలో కార్మికుడికి ఎటువంటి అనారోగ్యం పాలైన మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి 4. మరియు ప్రాముఖ్యంగా మహిళ కార్మికులకి వేతనముతో కూడుకున్న ప్రసూతి సెలవులు ఇవ్వాలి 5. ప్రతి కార్మికుడికి నాలుగు సెలవ దినములు రెండు సియల్ గా ప్రకటించాలి. ఈ కార్యక్రమంలో SPS రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క్ నరేష్ SPS రాష్ట్ర కమిటీ కోశాధికారి పత్తిపాటి శ్రీనివాస్ SPS రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ రాష్ట్ర కమిటీ సభ్యులు వల్లపుదాసు. శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :