DNB News - తెలంగాణ / : ఆదరిస్తే మద్దులపల్లిని అభివృద్ధి చేస్తానని ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల బరిలో సిపిఎం పార్టీ బలపరచిన బి.ఆర్.ఎస్ 17 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని కర్లపూడి ఇందిర తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్లపూడి ఇందిర మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సహకారంతో వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.సిపిఎం పార్టీ బలపరచిన బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థినిగా అభివృద్ధికి బాటలు వేస్తానని అన్నారు. ప్రజల సమస్యలు తీర్చేందుకు నా వంతు కృషి చేస్తానని మాట ఇచ్చారు. ఎన్నికల గుర్తు కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.
Admin
DNB News