DNB News - తెలంగాణ / : .తుమ్మల అభివృద్ధి బాట...మన్యం ప్రగతి బాట రహాదారులు బ్రిడ్జిల నిర్మాణంతో ఏజెన్సీ వెలుగు చుక్కగా నిలిచిన తుమ్మల. ఏజెన్సీ ఆదివాసులను రహదారులతో నాగరికతవైపు నడిపించిన తుమ్మల. గోదావరి శబరి నదులపై హై లెవల్ బ్రిడ్జిలతో ఐకాన్ గా నిలిచిన తుమ్మల తాలిపేరు వద్ద బ్రిడ్జితో చర్ల వెంకటాపురం వాజేడు మండలాలను భద్రాద్రితో అనుసంధానం. .కూనవరం వద్ద శబరి గోదావరి సంగమ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణంతో చరిత్రలో నిలిచిన తుమ్మల. నాడు తెలుగుదేశం హాయాంలో ఎన్టీఆర్ చంద్రబాబు క్యాబినెట్ లో భద్రాద్రి ఏజెన్సీ అభివ్రుద్దికి పాటుపడ్డ తుమ్మల. గతంలో కేసీఆర్ క్యాబినెట్ లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో భద్రాద్రి నీ ప్రగతి బాట పట్టించిన మహర్షి... తుమ్మల భద్రాద్రి ఏజెన్సీతో ఓడిషా....ఛత్తీస్ ఘడ్ మహారాష్ట్ర తో జాతీయ రహాదారులకు నాంది. మానవ వికాసం గ్రామీణాభివ్రుద్ది రహదారులతోనే సాధ్యం......మంత్రి తుమ్మల. ఏజెన్సీ ప్రాంతం....ఎక్కడైనా ఏజెన్సీలో ఆదివాసులు విద్యా వైద్యం అందక ప్రభుత్వ అభివ్రుద్ది సంక్షేమ ఫలాలు దక్కక,అభివ్రుద్దికి ఆమడదూరంలో, నాగరిక సమాజానికి దూరంగా బతుకుతున్న అభాగ్యులు.ఆకలేస్తే దుంపలు రోగమొస్తే చెట్ల పసర్లు,జాతరొస్తే జీలుగ కల్లు కష్టమొచ్చినా సంతోషమైనా ఆ అడవే అమ్మ వారికి.అదంతా ఏజెన్సీ లో కనపడే దుర్బర జీవనపరిస్థితులు.కానీ తరతరాలుగా హరిఘోష పడుతున్న అడవిబిడ్డల తలరాత మార్చాలనుకుండు ఓ ప్రజానాయకుడు.మన్యం వాసులను నాగరిక సమాజం వైపు నడిపించాలన్నా,వారి జీవితాల్లో మార్పు రావాలన్నా మానవ వికాసం, మన్యం అబివ్రుద్ది కోసం రహాదారుల నిర్మాణం, వాగులు నదులపై బ్రిడ్జిల నిర్మాణంతోనే సాధ్యమని, రహదారులు బ్రిడ్జిల నిర్మాణంతో ఆ ప్రజానాయకుడు అనుకున్నది సాదించగా, దశాదిశ మారిన ఏజెన్సీ గా భద్రాద్రి చరిత్రలో నిలిస్తే, భద్రాద్రి ఏజెన్సీ తలరాత మార్చిన మన్యం సూర్యుడుగా మంత్రి తుమ్మల చరిత్రలో నిలిచారు. భద్రాద్రి ఏజెన్సీ తరతరాలుగా చెప్పాలంటే నాటి త్రేతాయుగం లో శ్రీరాముడు సీతమ్మ తల్లితో వనవాసం చేసిన దండకారణ్య ప్రాంతం.నాటి రోజుల్లో శ్రీరాముడికి అటవీఫలాలు నైవేధ్యంగా సమర్పించిన శబరి నుంచి నేటి వరకూ ప్రిమిటివ్ ట్రైబ్స్ కు పుట్టినిల్లుగా దండకారణ్యం ఉంది.భద్రాద్రి ఏజెన్సీలో గత 40 ఏండ్లు వెనక్కి వెళితే స్వాతంత్ర్య భారతంలో ఇలాంటి వారు మన పోరుగునే అడవిలో బతుకుతున్నరంటే ఆశ్చర్యం వేసే విధంగా ఉండేది వారి జీవనవిధానం.భద్రాద్రి ఏజెన్సీలో ఆదివాసులు ముఖ్యంగా కోయలతో పాటు కొండరెడ్ల జీవన విధానం చాలా దుర్బరంగా ఉండేది.విద్యా వైద్యం లేక ప్రభుత్వ అభివ్రుద్ది సంక్షేమ కార్యక్రమాలు దక్కక,పౌష్టికాహారం లేక విషజర్వాలతో మన్యం మంచాన పడితే మరణమే శరణ్యం వారికి.అడవిలోనే పుట్టారు అడవిలోనే కలసిపోతున్నరు కానీ వారికి నాగరిక సమాజం లోకి రాలేని దుర్బర స్తితి.ఎందుకంటే వారి మంచిచెడులు ఆలోచించే నాయకుడు ఉండాలీ కదా. భద్రాద్రి ఏజెన్సీలో మన్యంవాసుల తలరాత మార్చడానికి ఆ భధ్రాద్రి రాములోరి అంశతో పుట్టిన ఓ నాయకుడు రాజకీయాల్లో అడుగుపెట్టాక భద్రాద్రి ఏజెన్సీ తలరాత మారింది.చిన్నతనంలో కోయ గూడాల మధ్య పెరిగినోడు కదా,ఆ అడవి తల్లుల ఘోస తెల్సినోడు కదా,రాజకీయాల్లో రాగానే మంత్రి కాగానే,బుగ్గ కారులో తిరగడం కాదు,ఆర్బాటం కోసం కాదు,ప్రజాసేవ కోసం చరిత్రలో నిలవాలనుకుండు.. భద్రాద్రి ఏజెన్సీ లో అడవిబిడ్డల తలరాత మార్చాలనుకుండు.. మనతో సమానంగా వాళ్లు మనుషులే అని నాగరిక సమాజం గుర్తించేలా చేయాలనుకుండు,మన్యం అభివ్రుద్దికి ఏదైతే చేయాలనుకుండో అది చేసి చరిత్ర పుటల్లో నిలవడమే కాదు భద్రాద్రి ఏజెన్సీ అభివ్రుద్ది వెలుగుచుక్కగా మన్యం సూర్యుడిగా చరిత్రలో నిలిచారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. మన్యం నాగరికతకు రహాదారులే శ్రీరామరక్ష...... భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతం అభివ్రుద్ది చెందాలన్నా,మన్యం వాసుల జీవితాల్లో మార్పులు రావాలన్నా,మన్యం నాగరికత వైపు అడుగులు వేయాలన్నా,మానవ వికాసం జరగాలన్నా రహాదారులతోనే సాధ్యమని బలంగా నమ్మిండు తుమ్మల.దాంతో నాడు తెలుగుదేశం హాయంలో యన్టీఆర్ చంద్రబాబుల క్యాబినేట్ లో మంత్రిగా ఉన్న తుమ్మల,తన నియోజకవర్గం సత్తుపల్లి అభివ్రుద్ది కాదు ముఖ్యం,అడవిలో దుర్బర జీవితాల్లో ఉన్న వారి జీవితాల్లో వెలుగులు నింపాలనుకుండు తుమ్మల.ఏ నాయకుడు కూడా తుమ్మల మాదిరి ఆలోచించి ఉండరు,వారి మనస్సు గుండె చప్పుడు తెల్సిన తుమ్మల,ఏజెన్సీ వాసుల తలరాత మార్చడం కోసం దీర్ఘకాలిక ప్రణాళిక తో ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలకు రోడ్ కనెక్టికిటి కల్పించడం కోసం రహాదారుల నిర్మాణం వాగులు వంకలపై బ్రిడ్జిల నిర్మాణంతో పాటు చర్ల మండలం తాలిపేరు వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం,గోదావరి శబరి నదులపై హై లెవల్ బ్రిడ్జి ల నిర్మాణంతో భద్రాద్రి ఏజెన్సీ లో తలరాత మార్చి మన్యం వాసులను నాగరిక సమాజం వైపు అడుగులు వేయించిండు తుమ్మల. .భద్రాచలం తో మూడు మండలాలను అనుసంధానం చేసిన తాలిపేరు బ్రిడ్జి చర్ల మండలం తాలిపేరు వద్ద లో లెవల్ బ్రిడ్జి ఉండటంతో వానాకాలంలో లో లెవల్ బ్రిడ్జి మునిగిపోయేది.దాంతో చర్ల వెంకటాపురం వాజేడు మండలాల ప్రజలు భద్రాచలంకు రాకపోకలు ఆగిపోయేవి.బస్సులు నడిచేది కాదు,నాటు పడవల పై దాటినా ఎంతో కష్టమైన ప్రయాణం.అత్యవసర వైద్య సేవలు కావాల్సిన వారు,గర్బిణీల ఘోస చెప్పలేనిది.ప్రభుత్వ అధికారులు వానాకాలంలో చర్ల వెంకటాపురం వాజేడు లోనే ఉండిపోవాల్సి వచ్చేది.ఏజెన్సీలో విద్యా వైద్యం అందాలన్నా సర్కార్ అభివ్రుద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరాలన్నా రహదారులే కీలకంగా మారినయ్యి.ఎందుకంటే రోడ్ ఉన్నా,వాగులు వంకలు నదులపై బ్రిడ్జిలుంటే ఏజెన్సీ వాసులు మనతో సమానంగా బతికేవారు కానీ ఆ అవకాశం లేకుండా పోయింది భద్రాద్రి ఏజెన్సీలో తరతరాలుగా రహాదారుల సౌకర్యం లేక బ్రిడ్జి లు లేక ఏజెన్సీ జనం అనేక కష్టాలు పడేది.ఏజెన్సీ తలరాత మార్చాలనుకున్న తుమ్మల తాలిపేరు వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయడంతో గోదావరి కి వరదలు వచ్చినా హై లెవల్ బ్రిడ్జి కావడంతో భద్రాచలం నుంచి చర్ల వెంకటాపురం వాజేడు మండలాలకు రాకపోకలకు ఎలాంటి ఇబ్బింది లేకుండా పోయింది.మారుమూల గ్రామాలకు రహాదారుల నిర్మాణంతో పాటు వాగులు వంకలపై అనేక కల్వర్టులు కట్టించిండు తుమ్మల.దాంతో తరతరాలుగా బాధలుపడ్డ ఏజెన్సీ వాసులకు తుమ్మల కృషితో రోడ్లు బ్రిడ్జి ల నిర్మాణం కాగా ఏజెన్సీ ప్రాంతంలోకి విద్యా వైద్యం అందడంతో పాటు ప్రభుత్వ అభివ్రుద్ది సంక్షేమ కార్యక్రమాలు ఏజెన్సీ గూడాలకు చేరువయ్యినయ్యి.దేశంలోని మిగతా ఏజెన్సీ ప్రాంతాలకు భిన్నంగా భద్రాద్రి ఏజెన్సీ లో మాత్రం అభివ్రుద్ది చేరువైందని,మా పాలిట దేవుడిగా తుమ్మల ఎప్పటికి గుర్తుండిపోతడని ,తుమ్మల మన్యం అభివ్రుద్ది సూర్యుడని ఆనందం వ్యక్తం చేస్తున్నరు ఏజెన్సీ వాసులు.. గోదావరి పై బ్రిడ్జిల నిర్మాణంతో అంతరాష్ట్ర రాకపోకలు. వెంకటాపురం బ్రిడ్జితో తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిషా కు రాకపోకలు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బావం తర్వాత కేసీఆర్ క్యాబినేట్ లో ఆర్.అండ్ బీ శాఖామంత్రిగా చేరిన తుమ్మల కేసీఆర్ తో తనకున్న సానిహిత్యంతో భద్రాద్రి ఏజెన్సీ తలరాత మారడమే కాదు వారు కలలో కూడా ఊహించని అభివ్రుద్ది పనులకు శ్రీకారం చుట్టారు.భద్రాద్రి ఏజెన్సీలో ప్రధానంగా ప్రవహించే గోదావరి నదిపై వెంకటాపురం వద్ద బ్రిడ్జి నిర్మాణంతో తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల కు ఇంటర్ కనెక్ట్ బ్రిడ్జిగా నిలిచింది. మిత్రుడి కిచ్చిన మాట కోసం కూనవరం బ్రిడ్జి. తుమ్మల తను చదువుకునే రోజుల్లో తన స్నేహితుడు కూనవరంలో ఉండేవాడు.తన మిత్రుని కూతురి పెండ్లి నాటికి కూనవరం వద్ద బ్రిడ్జి నిర్మాణం చేస్తనని మాట ఇచ్చిండు తుమ్మల.ఇచ్చిన మాట ప్రకారం కూనవరం వద్ద బ్రిడ్జి నిర్మాణం చేసి తన మిత్రుని కూతురి పెండ్లికి హాజరైతే కూనవరం మండలం అంతా తుమ్మల లాంటి నాయకుడు ఉండాలని తరతరాలుగా పడ్డ కష్టాలకు చరమగీతం పాడిండని ఇప్పటికీ గోప్పగా చెబుతరు.ఎందుకంటే కూనవరం వద్ద శబరి గోదావరి నదుల సంగమం వద్ద బ్రిడ్జి కట్టకముందు శబరి దాటి కూనవరం వీఆర్.పురం చింతూరు మండలాల ప్రజలు భద్రాచలం రావాలంటే హరిఘోస పడేది..చంద్రబాబు పాలనలో మంత్రం గా ఉన్న తుమ్మల కూనవరం వద్ద బ్రిడ్జి నిర్మాణం చేశాక ఇవాళ ఆ బ్రిడ్జి పై ప్రయాణం చేస్తుంటే ఓ పక్క శబరి మరోపక్క గోదారమ్మ సంగమ ప్రాంతంలొ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఆ ప్రాంతం. ఇచ్చిన మాట ప్రకారం బ్రిడ్జి నిర్మాణంతో పాటు తరతరాలుగా మా కడగండ్లు తీర్చిన తుమ్మల మా పాలిట దేవుడని కూనవరం వాసులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి ఏజెన్సీ ని నాగరికత వైపు నడిపించి,ఏజేన్సీ వాసులకు విద్యా వైద్యం అభివ్రుద్ది సంక్షేమ కార్యక్రమాలు దక్కేలా చేసి,ఏజెన్సీ వాసుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత అక్షరాలా తుమ్మలదే.ఎందుకంటే భద్రాద్రి ఏజెన్సీ అభివ్రుద్ది వైపు అడుగులు పడ్డదంటే దానికి కారణం తుమ్మల ముందుచూపే.ఏజెన్సీలో రహాదారుల నిర్మాణంతో పాటు వాగులు వంకలపై నదులపై బ్రిడ్జిల నిర్మాణంతో రాకపోకలు ఉంటే,సహజంగానే గుణాత్మక మార్పులు వస్తయన్న తుమ్మల ప్రణాళికలు ఫలించినియ్యి.ఇపుడు ఏజెన్సీలో అన్ని సౌకర్యాలు ప్రతి ఆదివాసీ పల్లెకు అందుతున్నయంటే,కోయగూడాల్లో కొండరెడ్ల గుంపుల వద్ద ఏడ చూసినా తుమ్మల వల్ల వారి జీవితాల్లో పెనుమార్పులు వచ్చినయ్యి. తుమ్మల చిన్నతనంలో కోయగూడాల మధ్య పెరగడం,చిన్నతనంలో దారులు లేక పొలాల గట్ల మీద బడికి వెళ్లడానికి పడ్డ పాట్లు,అత్యవసర వైద్యం అందక కళ్లెదుటే ఆగిన గుండెలు చూసి,రాజకీయాల్లోకి వచ్చాక నేను నా కుటుంబం అనే స్వార్ధానికి తావులేకుండా ,భద్రాద్రి రాముల వారి ఆశీస్సులతో పుట్టిన కారణ జన్ముడిలా నాడు యన్టీఆర్ చంద్రబాబు తర్వాత కేసీఆర్ క్యాబినేట్ లో ప్రస్తుతం రేవంత్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న తుమ్మల తన రాజకీయ జీవితంలోనే కాదు చరిత్రలో నిలిచేలా ఏజెన్సీ ప్రాంత అభివ్రుద్దికి చేసిన పనులు చరిత్ర ఎన్నటికి మరువదు.ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు....మంత్రిగా అధికార దర్పం అనుకోలేదు .....ప్రజా సేవ కోసం ఆ రాములోరి ఆశీస్సులతో ఆ శ్రీరాముడు నడయాడిన దండకారణ్యం అభివ్రుద్దికి హనుమంతుడిలా పట్టుపట్టి రోడ్ల నిర్మాణం బ్రిడ్జిల నిర్మాణంతో భద్రాద్రి ఏజెన్సీ అభివ్రుద్ది సూర్యుడు గా మన్యం వెలుగు చుక్కగా చరిత్రలో నిలిచారు తుమ్మల. తరతరాలుగా అడవిలోనే దుర్బర జీవితాలు గడుపుతున్న ఆదివాసుల జీవితాల్లో వెలుగులు నింపిన తుమ్మల ను తరాలు మారినా మర్చిపోలేరు.ఎందుకంటే ఆయన అడవిబిడ్డల గుండెచప్పుడు.....ఆయన కోయ వాళ్ల పెద్దన్నఅడవినే నమ్ముకున్న ఆడబిడ్డలకు పెద్దన్న.. తరాలు మారినా మారని జీవితాల్లో వెలుగులు నింపిన మహార్షి.. రాజకీయాలంటే రాజసం కోసం కాదూ.....ఆర్బాటం కోసం కాదు మిత్రమా.....రాజకీయాలంటే సమాజ ప్రగతికి బాటలు వేసేలా అనాగరిక ప్రపంచంలో ఉన్న అడవిబిడ్డల జీవితాల్లో శాశ్వత మార్పుకు నాంది పల్కిన ది లెజండ్ ...ది గ్రేట్ లీడర్ తుమ్మల నిలువెత్తు నిదర్శనం.... సార్ మీరు చూపిన బాట మాకు ఆదర్శం......సార్ మీరు చూపిన అభివ్రుద్ది దారులు అడవిబిడ్డల జీవితాలకు ప్రగతిబాటలు భద్రాద్రి ఏజెన్సీ ప్రజల పక్షాన మీకు కృతజ్ఞతలు
Admin
DNB News