DNB News - తెలంగాణ / : ఇబ్రహీంపట్నం పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంచాల మండలం నోముల గ్రామంలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు, నోముల గ్రామానికి చెందిన మధర్మోని బాబు మద్యం మత్తులో తన భార్య అమృతపై దాడి చేశాడు. ఘటనకు ముందు వారి కోడలిని మరో గదిలో బంధించి, గదికి తాళం వేసిన తరువాత ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గ్రామస్తులు చెబుతున్నారు. అమృతపై గొడ్డలితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Admin
DNB News