Monday, 15 June 2026 02:00:49 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

పొగాకు నెమ్మదిగా ప్రాణాలు తీసే విషం.

Date : 01 June 2026 10:47 AM Views : 21

DNB News - తెలంగాణ / : పొగాకు వాడకం కేవలం ఒక చెడు అలవాటు మాత్రమే కాదని, అది నెమ్మదిగా మనిషి ఆరోగ్యాన్ని కబళించే ప్రమాదకర విషమని వైద్యులు హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన సదస్సులో వైద్యులు పొగాకు, బీడీ, గుట్కా, తంబాకు వాడకం వల్ల కలిగే తీవ్ర ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్డియాలజిస్టు డాక్టర్ అనీష్ పబ్బ, జనరల్ ఫిజీషియన్లు డాక్టర్ నాగరాజు, డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ పొగాకు వినియోగం నేరుగా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. బీడీ, సిగరెట్, గుట్కా వంటి అలవాట్లు రక్తనాళాలను దెబ్బతీసి గుండెపోటు, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయని వివరించారు. కొంతమంది ఒత్తిడి తగ్గించుకోవడానికి లేదా సరదాగా పొగ తాగడం ప్రారంభిస్తారని, కానీ అదే తర్వాత ప్రాణాంతక అలవాటుగా మారుతుందని చెప్పారు. నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్న వారిలో అధిక శాతం మంది పొగాకు వినియోగదారులేనని తెలిపారు. ప్రస్తుతం యువతను లక్ష్యంగా చేసుకుని పొగాకు ఉత్పత్తుల తయారీ సంస్థలు ఆకర్షణీయ ప్రచారాలు నిర్వహించడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ఫ్లేవ‌ర్స్‌ కలిపిన పొగాకు పదార్థాలు, కొత్త రూపాల్లో అందుబాటులోకి తీసుకురావడం వల్ల యువతతో పాటు చిన్నపిల్లలు కూడా వీటి వైపు ఆకర్షితులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాషన్‌గా మొదలైన పొగతాగే అలవాటు చివరికి వ్యసనంగా మారి ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని, కుటుంబ బంధాలను దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి పొగతాగితే దాని ప్రభావం అతడికే పరిమితం కాదని, కుటుంబ సభ్యులపై కూడా తీవ్రంగా పడుతుందని హెచ్చరించారు. పొగతాగే వ్యక్తి విడుదల చేసే పొగను పీల్చడం వల్ల పిల్లలు, మహిళలు, వృద్ధులు, గ‌ర్భిణులు పరోక్షంగా అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం అధికమని వెల్ల‌డించారు. చిన్నారుల్లో శ్వాసకోశ సమస్యలు, అలెర్జీలు, ఊపిరితిత్తుల ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందన్నారు. బీడీ కార్మికులు కూడా అధిక సంఖ్యలో క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడుతున్న పరిస్థితి ఆందోళనకరమని అన్నారు. చెడు అలవాట్లను జీవితంలోకి రానివ్వకుండా యువత జాగ్రత్త పడాలని, ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలని వైద్యులు పిలుపునిచ్చారు. మెడిక‌వ‌ర్ సెంట‌ర్‌హెడ్ గుర్రం కిర‌ణ్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ అవ‌గాహ‌న స‌ద‌స్సులో మార్కెటింగ్ మేనేజ‌ర్ కోట క‌ర్ణాక‌ర్‌, దాస‌రి చంద్ర‌శేఖ‌ర్‌, అబ్దుల్ వ‌కీల్‌, సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ ప్రియాంక త‌దిత‌రులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :