DNB News - తెలంగాణ / : ఫోన్ టాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు కవిత, ప్రత్యక్ష సాక్షిగా నిలిచారని, “నా భర్త ఫోన్, నా ఫోన్ కూడా టాపింగ్ చేశారు” అని ఆమె స్వయంగా చెప్పడం ఈ ఆరోపణలకు బలమైన ఆధారమని ఆయన పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఎవరి దయ వల్ల రాలేదని, సకల జనుల పోరాటంతో, లక్షలాది మంది త్యాగాలతో తెలంగాణ సాధ్యమైందని, *యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ గొప్ప త్యాగం వల్లే రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు *గద్దర్ గారిని 70 ఏళ్ల వయసులో ప్రగతి భవనం ముందు ఏడు గంటలు నిలబెట్టి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అన్యాయమని, అలాగే తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ గారిని తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసినప్పుడు మానవత్వం ఎక్కడ పోయిందని ప్రశ్నించారు.దేశంలో అనేక మంది ప్రముఖ నాయకులు – జయలలిత, మాయావతి, యడ్యూరప్ప, లాలూ ప్రసాద్ యాదవ్, సింబు సోరెన్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విచారణను ఎదుర్కొన్నారని గుర్తు చేస్తూ, కెసిఆర్, నిజాయితీపరులైతే విచారణకు పూర్తిగా సహకరించి తన నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాని అరుపులు, ధర్నాలు, బెదిరింపులతో ప్రజలను మభ్యపెట్టలేరని, నిజం ఉంటే చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ప్రజాస్వామ్యం, చట్టపాలన కచ్చితంగా అమలు అవుతాయని, కాబట్టి బి.ఆర్.ఎస్ నాయకులు సంయమనం పాటించాలని, ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని చంద్రశేఖర్ యాదవ్ హెచ్చరించారు.
Admin
DNB News