DNB News - తెలంగాణ / : వైద్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి నాణ్యమైన, సత్వర వైద్య సేవలు అందించాలి, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్, మంగళవారం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్ మహబూబాబాద్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన జనరల్ హాస్పిటల్ లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాస్పిటల్ లోని ఓపి వార్డు, ఏఎంసీ, ఐసీయూ, పిడియాట్రీషియన్, ఎస్ఎన్సియు, జనరల్ మెడికల్ వార్డు, ఆలనా సెంటర్, ప్రతి వార్డులు తిరుగుతూ వైద్యం కోసం వచ్చిన పేషెంట్లు, వారి బంధువులతో స్వయంగా మాట్లాడారు, హాస్పిటల్ లో అందిస్తున్న సేవలు, ఆహారం తదితర అంశాలపై ఆరా తీశారు, హాస్పిటల్ లోని సిబ్బంది హాజరు పట్టిక, స్టోర్ స్టాక్ రిజిస్టర్, ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ రిజిస్టర్లు, డ్యూటీ ఆర్డర్స్, రిజిస్టర్, వైద్య పరీక్షలు నిర్వహించే ఇండెంట్ రిజిస్టర్, బయోమెట్రిక్ రిజిస్టర్, మెడిసిన్ స్టాక్ రిజిస్టర్ లను ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సుదీర్ఘ సమయం హాస్పిటల్, వార్డులు, పరిసరాలను స్వయంగా పరిశీలించారు.
Admin
DNB News