DNB News - తెలంగాణ / : మునగాల : మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం మండల పరిధి జాతీయ రహదారి 65 పై మొద్దులచెరువు స్టేజి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసు వారిని గమనించి ఒక కారు లో ఉన్న వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కారు తనిఖీ చేయగా అందులో సెల్ ఫోన్ టవర్ల కు చెందిన బ్యాటరీలను గుర్తించి విచారించడం జరిగింది. విచారణలో భాగంగా నలుగురు నిందితులు సెల్ఫోన్ టవర్లను లక్ష్యంగా చేసుకొని బ్యాటరీలు దొంగతనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. వారి నుండి ఆరు బ్యాటరీలను ఒక కారును స్వాధీనపరచుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. వీరిని విచారించగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన తబరక్ హుస్సేన్, ఉత్తరాఖండ్ చెందిన అహ్మద్ సుఫియాన్, ఉత్తరప్రదేశ్ కు చెందిన రైసుద్దీన్, సులేమాన్ లుగా గుర్తించారు. వీరు సెల్ఫోన్ టవర్ల నందు బ్యాటరీ పనులు చేసే సమయంలో పరిచయమైనట్లు గుర్తించడం జరిగిందని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిందితులు జలసాలకు అలవాటు పడి ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని సెల్ఫోన్ టవర్ నందు బ్యాటరీ పనిచేసిన అనుభవం ఉండటంతో సెల్ఫోన్ టవర్ బ్యాటరీలు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. వికారాబాద్ జిల్లా, గద్వాల జిల్లాలలో ఐదుచోట్ల ఇలాంటి దొంగతనాలకు పాల్పడి అక్కడ దొంగిలించిన బ్యాటరీలను సికింద్రాబాద్ కు చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తి ద్వారా ఈ బ్యాటరీలను ఢిల్లీలో ఉన్న వ్యక్తికి అమ్ముతున్నట్లుగా ఒప్పుకున్నారు ఇలా అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఉన్నారు. అలాగే మునగాల మండల పరిధి జాతీయ రహదారి 65 పై గల ఇంద్రానగర్ వద్ద ఉన్న జియో సెల్ టవర్ నందు ఆరు బ్యాటరీలను దొంగలించినట్లు ఒప్పుకున్నారు అని ఎస్ఐ తెలిపినారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగినది అన్నారు.
Admin
DNB News