DNB News - తెలంగాణ / : గర్ల్ చైల్డ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని మూడవ అదనపు జిల్లా జడ్జి ఏ. నీరజ అన్నారు. శనివారం నగరంలోని రోహన్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ‘దేవిపుత్రిక’ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అమ్మాయి పుట్టిన వారికి ఉచితంగా నార్మల్, సిజేరియన్ డెలివరీలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గర్ల్ చైల్డ్ ప్రోత్సాహానికి దోహదపడాలని సూచించారు. డాక్టర్ బి.ఎన్.రావు మాట్లాడుతూ వైద్యంలో దాదాపు అన్ని సేవలను ఉచితంగా అందించడం ప్రశంసనీయమన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ ఎనమల్ల శ్రీదేవి మాట్లాడుతూ ఆడపిల్ల భారం కాదని, మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ఆసుపత్రి నిర్వాహకుడు డాక్టర్ ఎనమల్ల నరేష్ మాట్లాడుతూ ఏడాది పాటు అమ్మాయి జన్మించిన వారికి ఉచిత డెలివరీలు అందిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యులు పాల్గొన్నారు.
Admin
DNB News