DNB News - తెలంగాణ / : మునగాల న్యూస్ :ఘనంగా కలకోవ సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ br. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి పడిసిరి. నరసింహారావు సభ అధ్యక్షత వహించి నడిపించడం జరిగింది ఆతరువాత మునగాల మండల సీపీఎం పార్టీ కార్యదర్శి కామ్రేడ్ బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ డాక్టర్ br. అంబేద్కర్ అంటే ఒక కులానికి ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు అని... ప్రపంచం అంత ఈరోజు జ్ఞాన దినోత్సవన్నీ నిర్వహించడం గొప్ప విషయం అని ఆయన అన్నారు.. కానీ మన భరతదేశం లో మాత్రం ఆయనకు కనీసం గౌరవం ఇవ్వని పార్టీలు నాయకులు ఉన్నారు అని.అన్నారు ఆయన అన్ని వర్గాల ప్రజలకోసం అన్ని జాతుల హక్కుల కోసం పోరాడిన మహనీయులు అని బుర్రి శ్రీరాములు అన్నారు సీపీఎం గ్రామ షాఖ ఆధ్వర్యంలో ప్రతి జయంతి వర్ధంతి వేడుకలు నిర్వహించడం మంచి నిర్ణయం అని ఆయన అన్నారు... ఈ నాటి యువత ఆయన భావాలు ఆయన విధానాలు మర్చిపోయి మద్యం.. గుట్కాలు వ్యాసనాలకు బానిసలై పోతున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు... ఆయనకు పూలు వేసి సభలు నిర్వహిస్తే సరిపోదు అని ఆయన బావాలు ప్రజలోకి యువత తీసుకెల్లాలని బుర్రి శ్రీరాములు అన్నారు అనంతరం కలకోవ గ్రామ సర్పంచ్ మండవ వేంకటాద్రి మాట్లాడుతూ డాక్టర్ br. అంబేద్కర్ అంటే ఈ నాటి యువతకు సరిగా అర్ధం కాలేదు అని... ఆయన అర్ధం అయితే ఆచరణలో పెట్టాలి అని... అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అంబేద్కర్ కృషి చేశారు అని ఆయన అన్నారు.. కలకోవ గ్రామ యువత తాగుడుకు వ్యాసనాలకు దూరంగా ఉండి మహనీయుల మార్గం లో నడవాలి అని సర్పంచ్ మండవ వేంకటాద్రి అన్నారు ఈ కార్యక్రమం లో శాఖ కార్యదర్శులు కాసాని ముతయ్య. పడిసిరి. నరసింహారావు.. బుర్రి బాబు. మండవ లింగయ్య. బుర్రి సతీష్. బెల్లంకొండ మోహనరావు. చిన్నప్పయ్య. గుండు రంగన్న. ముదిగొండ రామారావు. నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News