DNB News - తెలంగాణ / : మునగాల పరిధి కోదండరామాపురం గ్రామంలో ఒక ఇంట్లోకి అక్రమంగా వచ్చి బూతులు తిడుతున్నాడు అని గ్రామానికి చెందిన వ్యక్తి ఒకతను డయల్ 100 ద్వారా పోలీసులకు పిర్యాదు చేశారు. పిర్యాదు పై స్పందించిన మునగాల పోలీస్ కొదందరమపురం గ్రామంలో సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితుల నుండి ఫిర్యాదు తీసుకుని బాధితుల వద్దనే కేసు నమోదు చేసి బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీని అందజేశారు. అలాగే మండల పరిధికి చెందిన వృద్ధ దంపతులు మునగాల నుండి నరసింహుల గూడెం గ్రామం వెళ్ళడానికి టీవీఎస్ మోటార్ సైకిల్ పై జాతీయ రహదారి 65 పై మొద్దులచెరువు స్టేజి వద్ద రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురయ్యారు. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించి సంఘటన స్థలం వద్ద నుండి కేసు నమోదు చేశారు.బాధితుల ఇంటి వద్ద నుండే కేసు నమోదు అనే కార్యక్రమం ఫిర్యాదుదారులకు ఎంతో ఉపయోగపడుతుందని మహిళా, వృద్దులు, పిల్లల పట్ల వేదింపులు, రోడ్డు ప్రమాదాలు, భౌతిక దాడులు, దొంగతనాలు, అట్రాసిటీ సంబంధ ఫిర్యాదుదారుల్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సంఘటనలపై పోలీసులకు సమాచారం అందించిన వెంటనే బాధితుల ఇండ్లకు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే కేసు నమోదు చేసి కేసు పత్రాలను బాధితులకు అందిస్తున్నామని ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
Admin
DNB News