DNB News - తెలంగాణ / : దీంతో క్షణికావేశానికి గురైన ఆ విద్యార్థిని పురుగు మందు తాగగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన జన్నారం మండలం రోటిగూడ గ్రామంలో చోటు చేసుకుంది. జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మోత్కూరి లక్ష్మీనారాయణగౌడ్-పద్మ దంపతుల చిన్న కూతురు మోత్కూరి అక్షయ(19) లక్షెట్టిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. వార్షిక పరీక్షలు జరుగుతున్నందున టీవీ చూడటం ఆపేసి చదువుకోవాలని ఈ నెల 3న తల్లిదండ్రులు మందలించారు. చదువుకోమని చెప్పి టీవీ ఆఫ్ చేసి వాళ్లిద్దరూ పనులకు వెళ్లారు. క్షణికావేశంలో ఆ విద్యార్థిని ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. హుటాహుటిన కుటుంబసభ్యులు ఆమెను జన్నారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు కరీంనగర్ తరలించారు. చికిత్స పొందుతూ గురువారం అక్షయ మృతి చెందింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Admin
DNB News