DNB News - తెలంగాణ / : తిరుమలాయపాలెం : పాలేరు నియోజకవర్గ ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తున్న ‘ప్రజా దర్బార్’ శనివారం మండల కేంద్రంలో జరగనుంది. మధ్యాహ్నం 3:00 గంటల నుంచి తిరుమలాయపాలెం క్లస్టర్ పరిధిలోని ప్రజల వినతులు స్వీకరించేందుకు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అధికారులు ఏర్పాట్లు చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి : భూ సంబంధిత అంశాలు, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, గృహజ్యోతి పథకం వంటి వివిధ ప్రజా సమస్యలపై వచ్చే దరఖాస్తులను మంత్రి పొంగులేటి క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. జిల్లా కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు వేదికపైనే అందుబాటులో ఉండి, అర్హత ఉన్న సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టనున్నారు. హాజరుకావాల్సిన గ్రామాలు : ఈ ప్రజా దర్బార్‌కు తిరుమలాయపాలెం క్లస్టర్ పరిధిలోని తిరుమలాయపాలెం, బాలాజీనగర్ తండా, వెదుళ్ళచెర్వు, కేశవాపురం, పిండిప్రోలు, ఎర్రగడ్డ, కొక్కిరేణి, తాళ్ళచెరువు, తిమ్మక్కపేట, అజ్మీరతండా, దమ్మాయిగూడెం, తెట్టెలపాడు, తిప్పారెడ్డిగూడెం, పడమటితండా, హైదర్సాయిపేట 15 గ్రామాలకు చెందిన ప్రజలు హాజరు కావాలని అధికారులు సూచించారు. సద్వినియోగం చేసుకోవాలి : క్లస్టర్ పరిధిలోని ప్రజలు తమ సమస్యల దరఖాస్తులతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి కోరారు.
Admin
DNB News