DNB News - తెలంగాణ / : ఆదర్శ నేత సంఘసంస్కర్త అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ PRTU జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్ రంగారావు భారత మాజీ ఉప ప్రధాని భరతజాతి ముద్దుబిడ్డ బాబు జగజ్జీవన్ రామ్ 119 వ జయంతిని పురస్కరించుకుని PRTU మధిర మండల శాఖ ఆధ్వర్యంలో మధిర MDO కార్యాలయ ఆవరణలో జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రంగారావు మాట్లాడతూ 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలో సామాన్య దళిత కుటుంబంలో జన్మించిన జగజ్జీవన్ రామ్ గారు పట్టుదల కృషితో ఉన్నత చదువులను అభ్యసించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వతంత్ర భారతదేశంలో భారతజాతి గర్వించేలా భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించి అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు భారత ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా వ్యవసాయ మంత్రిగా రక్షణ మంత్రిగా, అనేక ఇతర శాఖలతో మూడు దశాబ్దాలకు పైగా మంత్రిగాను 50 సంవత్సరాల పాటు ఏకధాటిగా పార్లమెంటు సభ్యునిగా కొనసాగి రికార్డ్ సృష్టించారని పేర్కొన్నారు. వారి జయంతి సందర్భంగా వారికి PRTU మధిర మండల శాఖ పక్షాన జిల్లా శాఖ పక్షాన వారికి ఘన నివాళులర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఆర్ బ్రహ్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు CHVరవికుమార్ రాష్ట్ర బాధ్యులు SKమదార్, మాజీ రాష్ట్ర బాధ్యులు కోట జయరాజు మధిర మండల అధ్యక్షులు చిలుకూరి సత్యనారాయణ రెడ్డి నాయకులు కొలగాని ప్రసాదరావు పిల్లి నరసింహారావు L అప్పారావు D శ్యామలరావు Tఅజయ్ కుమార్ Mనాగేశ్వరరావు VVN రాజు రుద్రపోగు శ్రీను రత్నబాబు, శీలం శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News