Wednesday, 17 June 2026 02:39:26 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీ ఆర్ పి సత్తా చాటుతాం.

Date : 24 January 2026 10:50 AM Views : 63

DNB News - తెలంగాణ / : మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీ ఆర్ పి సత్తా చాటుతాం. బల్దియా ఎన్నికలే లక్ష్యంగా టీ ఆర్ పి కార్యాచరణ, ప్రధాన పార్టీ ముఖ్య నాయకులు టీ ఆర్ పి పార్టీ తో టచ్ లో ఉన్నారు. ఆశవాహులు కత్తెర గుర్తు కోసం పార్టీ జిల్లా కమిటీకి దరఖాస్తూ పెట్టుకోవాలి.కరీంనగర్ జిల్లాలో 1 కార్పొరేషన్, 3 మున్సిపాలిటీలల్లో టీ ఆర్ పి పోటీలో ఉంటుంది మూడు పార్టీల అభ్యర్థులను చిత్తు చిత్తు గా ఒడిస్తాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గంగిపెళ్లి అరుణ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా మాట్లాడుతూ ⁠కరీంనగర్ కార్పొరేషన్ మరియు జిల్లాలో హుజురాబాద్, చొప్పదండి, జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సత్తా చాటుతామని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణతో జిల్లాలో మా నాయకత్వం పనిచేస్తుందని అన్నారు. లోకల్ బాడీస్ ఎన్నికల్లో ప్రసిద్ధిగాంచిన కత్తెర గుర్తు జిల్లాలోని మున్సిపల్, కార్పొరేషన్ లో ఎక్కువ స్థానాలు గెలిచేందుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. ఏ పార్టీ ఎన్ని కుట్రలు చేసిన జిల్లాలో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలలో కత్తెర గుర్తు పోటీలో ఉంటుందని, మా సత్తా చాటుతామని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు టీఆర్పీ పార్టీ కత్తెర గుర్తు కోరకు పార్టీ జిల్లా కార్యాలయం కశ్మీర్ గడ్డ (సాయి షికార ప్లాజా షెటర్ నెం.14) లో, జిల్లా కమిటీకి దరఖాస్తూ పెట్టుకోవాలని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో పోటీ చేసే వారికీ పార్టీ బి-ఫామ్ లు అన్నీ కూడా పార్టీ రాష్ట్ర కమిటీ ఆమోదంతో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగిపెళ్లి అరుణ గారు ఆశవహులుకు కత్తెర గుర్తు బి-ఫామ్ లు అందజేస్తారని తెలిపారు. ఆశవాహులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లా పార్టీ నాయకత్వాన్ని సంప్రదించాలని, వారు అప్లికేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అన్నారు. కరీంనగర్ జిల్లాలో కేంద్ర రాష్ట్ర అధికార ప్రభుత్వ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలను టీఆర్పీ పార్టీ చిత్తు చిత్తు గా ఓడిస్తుందని, జెనరల్ స్థానాలలో బీసీ అభ్యర్థులు పోటీ చేసి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని, అందుకు గాను బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీలు ఐక్యంగా పార్టీలో సైనికుల్లా కష్టపడుతున్నారాని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు గంగిపెళ్లి అరుణ, జిల్లా మైనారిటీ అధ్యక్షులు వాజిద్, టౌన్ ప్రెసిడెంట్ ఆర్షత్, ప్రధాన కార్యదర్శి ఎగుర్ల రమేష్, టౌన్ మహిళ అధ్యక్షురాలు జింక లావణ్య, సోషల్ మీడియా కన్వీనర్ మహబూబ్ అలీ, పార్టీ నాయకులు చిగుర్ల మోహన్, ఖాజా ఘోస్, కొత్తపెళ్లి శేఖర్, సయ్యద్ షాహిద్ హుస్సేన్, బోగ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :