DNB News - తెలంగాణ / : తిరుమలాయపాలెం మండల పరిధిలో పనిచేస్తున్న 66 మంది వివోఏలు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. గత 20 సంవత్సరాలుగా వివిధ గ్రామాల్లో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నప్పటికీ తమకు ఇప్పటివరకు సరైన గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రెస్ కోడ్, ఐడి కార్డులు, ఉద్యోగ భద్రత వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. ఎస్‌సీఆర్‌పీ, ఐకేపీ పరిధిలో ఉన్న ప్రతి పనిని బాధ్యతగా నిర్వహిస్తున్నామని, గ్రామ స్థాయిలో ప్రజా సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తమ శ్రమకు తగిన వేతనం అందడం లేదని పేర్కొన్నారు. పని భారం అధికంగా ఉండటంతో పాటు కుటుంబానికి తగిన భద్రత కూడా లేక తీవ్ర ఆందోళన చెందుతున్నామని అన్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పని గంటలను తగ్గించి గౌరవప్రదమైన వేతనం అందించాలని, ప్రతి వివోఏ కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిశీలించి ఉద్యోగ భద్రత కల్పిస్తూ న్యాయం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివోఏల జిల్లా అధ్యక్షురాలు వేల్పుల సుశీల గౌరవ అధ్యక్షురాలు పోలూరి విజయలక్ష్మి మండల ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ళ ఉమా కోశాధికారి పోలిశెట్టి అరుణ గుంతెటి విజయ కుమారి మేకల కృష్ణవేణి గోపోజి ఉపేంద్ర మెట్టు స్వరూప రాణి నూకల వసంత కలమ్మ రాజేశ్వరి రమణ మరియమ్మ బోడ కుసుమ ఇందిరా పద్మ రాంబాయి ఎం నాగమణి తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News