Wednesday, 17 June 2026 01:36:00 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

కర్రెగుట్టలు మావోయిస్టుల రహిత ప్రాంతం — అభివృద్ధి, భద్రతే లక్ష్యం: డిజిపి శివధర్ రెడ్డి

Date : 08 April 2026 02:56 PM Views : 41

DNB News - తెలంగాణ / : వెంకటాపురం (ములుగు): ప్రకృతి సౌందర్యానికి నిలయమైన ములుగు జిల్లాలోని కర్రెగుట్టల ప్రాంతం ఇప్పుడు మావోయిస్టుల ప్రభావం లేని ప్రశాంత ప్రాంతంగా అవతరించిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం జిల్లాలో పర్యటించిన ఆయన పామునూరు వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి గిరిజన ప్రాంతాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ, కర్రెగుట్టలపై మావోయిస్టుల ప్రభావం పూర్తిగా శూన్యమైందని, ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా గుత్తికోయ ప్రజలకు అండగా ఉంటూ వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రజల ఉపాధి అవకాశాలను పెంచే దిశగా పామునూరుకు చెందిన ఏడు కుటుంబాల ఉమ్మడి జీవనోపాధి కోసం ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనాన్ని అందజేయడంతో పాటు వారికి అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అటవీ సంపద, ప్రకృతి అందాలతో అలరారుతున్న కర్రెగుట్టలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన తెలిపారు. పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించే లక్ష్యంతో పోలీస్ ఔట్‌పోస్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. పాలనలో పారదర్శకత మరియు వేగవంతమైన అభివృద్ధి కోసం అటవీ, రెవెన్యూ, సీఆర్పీఎఫ్ మరియు పోలీస్ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు ప్రత్యేక సమన్వయ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం వెంకటాపురం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా "అరైవ్ అలైవ్" అవగాహన కార్యక్రమానికి డిజిపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 3,000 మంది పాల్గొన్న ఈ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను తప్పకుండా పాటించాలని, ప్రాణాల కంటే విలువైనది మరేదీ లేదని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 200 మంది వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేసి, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి వారి ఆరోగ్య భద్రతపై ఆరా తీశారు. డిజిపి బి. శివధర్ రెడ్డి పామునూరులోని సీఆర్‌పీఎఫ్ 39వ బెటాలియన్ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌ను సందర్శించి అక్కడ విధుల్లో ఉన్న జవాన్లతో ముఖాముఖి మాట్లాడారు. మారుమూల ప్రాంతాల్లో వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. కర్రెగుట్టలు వంటి కొండ ప్రాంతాల్లో వ్యూహాత్మక పట్టు సాధించడానికి మరియు ప్రాంతాన్ని మావోయిస్టు రహితంగా కొనసాగించడానికి రాష్ట్ర పోలీస్ మరియు సీఆర్‌పీఎఫ్ బలగాల మధ్య నిరంతర సమన్వయం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇదే పర్యటనలో మొరమురు గ్రామంలో మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నర్సరీని డిజిపి శివధర్ రెడ్డి రాష్ట్ర పీసీసీఎఫ్ సువర్ణతో కలిసి ప్రారంభించారు. అటవీ పెంపకంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. నర్సరీ కార్యకలాపాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. జిల్లా ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్ సమన్వయంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పీసీసీఎఫ్ సువర్ణ, గ్రేహౌండ్స్ అదనపు డిజిపి అనిల్ కుమార్, ఎస్ఐబి ఐజిపి సుమతి, సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :