DNB News - తెలంగాణ / : నేడు హైదరాబాద్ తాజ్ కృష్ణలో ఎంఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో “మూసీ ఇన్వైట్స్” కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. అలాగే పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, మేధావులు, పర్యావరణ నిపుణులు, అర్బన్ ప్లానర్లు, ఆర్కిటెక్టులు, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మూసీ నది పునరుజ్జీవనం మరియు రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదిత ప్రణాళికలను ప్రభుత్వం ఆవిష్కరించనుంది. మూసీ పునరుజ్జీవనం కింద స్వచ్ఛమైన నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, నది తీరాల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
Admin
DNB News