DNB News - తెలంగాణ / : ది. 02.02.2026 నాడు డి.న్.బి. న్యూస్ దిన పత్రిక లో ప్రచురితమైన ''మహా-బాద్ మున్సిపాలిటీ లో పాత ఇనుప సామాన్ల కుంభకోణం'' శీర్షిక కు స్పందించి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు విచారణకు ఆదేశించగా, మహ-బాద్ మున్సిపల్ కమిషనర్ గారు ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ ను విచారణ అధికారిగా నియమించి విచారణ కు ఆదేశించగా, విచారణ అధికారి విచారణ జరిపి అట్టి డి.న్.బి పత్రికలో వచ్చిన వార్త కథనం నిజమే అని, ఒక పారిశుధ్య జావాన్, మరియు ఇద్దరు పారిశుధ్య వాహనాల డ్రైవర్ లు అట్టి పారిశుధ్య వాహనాల విడి భాగాలను దొంగిలించి అమ్ముకున్నారని, నిజమే అని ధృవీకరించింది అట్టి విచారణ నివేదికను గౌరవ జిల్లా కలెక్టర్, మహా-బాద్ గారికి, మరియు మున్సిపల్ కమిషనర్ గారికి సమర్పించగా, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మున్సిపల్ కమిషనర్ గారు అట్టి దొంగతనం కు పాల్పడిన ఒక జవాన్ మరియు ఇద్దరు డ్రైవర్ లను విధుల నుండి తొలగిస్తూ ది. 30.05.2026 నాడు ఉత్తర్వులు జరిచేసినారు. మహా- బాద్ మున్సిపాలిటీ లో కొరవడిన అధికారుల పర్యవేక్షన'. మహా -బాద్ మున్సిపాలిటీ లో అధికారుల మాట కంటే రాజకీయ నాయకుల మాటకే విలువ ఎక్కువ అని, వారి మాటలే చెల్లుబాటు అవుతాయని, దాని వలన అధికారుల మాటలకు విలువ లేకుండా పోతోందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు, అధికారుల పై పెత్తనం చేస్తూ వారిని స్వేచ్చగా విధులు నిర్వర్తించకుండ, అతిగా విధులలో జోక్యం చేసుకోవడం వలన అధికారుల పర్యవేక్షణ కొరవడిందని కార్మికులు మాట్లాడుకుంటున్నారు, ఒక కార్మికుడు కానీ ఒక అధికారి కానీ తప్పు చేస్తే, రాజకీయ పలుకుబడి ఉపయోగించి శిక్ష నుండి తప్పించుకోవచ్చు అనే ధీమా తో ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి అని తెలుస్తుంది. తప్పు చేసిన వారికి తక్షణ ఉపశమనం! మహ-బాద్ మున్సిపాలిటీ లో ఉద్యోగి తప్పు చేసినా దొంగతనం చేసి దొరికి పోయిన సరే పనిష్మెంట్ అనేది పేపర్ కే పరిమితం అని ఉద్యోగస్తులకు వర్తించదు అని మరోసారి రుజువు అయ్యింది, ఇక్కడ ఎవ్వరూ తప్పు చేసిన విధులు నుండి తొలగిస్తే, ఒక వర్క్ ఇన్స్పెక్టర్ అనుకుంటే వెంటనే విధులలో చెరవొచ్చని అతనికి కమిషనర్ ఉతర్యులు కానీ జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్యులు పట్టింపు లేదని తేటతెల్లం అయ్యింది, తప్పుచేసినారని నిరూపణ అయిన మున్సిపాలిటీ జవాన్ వరియు ఇద్దరు శానిటరీ వాహన డ్రైవర్ లను మున్సిపల్ కమిషనర్ తాత్కాలికంగా విధులకు దూరంగా ఉంచాలని ఆర్డర్ ఇస్తే అట్టి ఆర్డర్ ను శానిటరీ ఇన్స్పెక్టర్ బేఖాతరు చేసి అట్టి తప్పు చేసిన వారిని విధులకు తీసుకొని అంతా తానే అనే విధంగా ప్రవర్తిస్తూన్నాడని, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అని, వారు చేసిన దొంగతనం లో అట్టి శానిటరీ ఇన్స్పెక్టర్ పాత్ర ఉందేమో అని కార్మికులు చర్చించుకుంటున్నారు, మున్సిపల్ కమిషనర్ కూడా పొలిటికల్ పవర్ కు తల వంచకుండా, తన విధులను నిజాయితీ గా నిర్వర్తించి, ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలి అంటే గొంగతనం చేసిన వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని వారిపై చట్టరీత్య కేసు నమోదు చేపించాలని మున్సిపల్ కమిషనర్, మహా-బాద్, మరియు జిల్లా కలెక్టర్ మహా-బాద్ గారిని ప్రజలు కోరుకుంటున్నారు, లేని పక్షంలో లో CDMA హైదరాబాద్ గారికి పిర్యాదు చేసే ఆలోచనలో కొంతమంది కార్మికులు ఉన్నారని సమాచారం.
Admin
DNB News