DNB News - తెలంగాణ / : శ్రీకాకుళం నియోజవర్గ పరిశీలకులుగా నియమితులైన పిన్నిoటి సాయి కుమార్ మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాo ను కలుసుకున్నారు. అదివారం ఆమదాలవలసలో తమ్మినేని నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పిన్నింటి సాయి కుమార్ ను తమ్మినేని అభినందించారు. విధేయత, సిన్సియారిటి, సమర్థత గల సాయిని గుర్తించిన పార్టీ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పదవి ఇచ్చి మంచి గుర్తింపు ఇచ్చారన్నారు క్రియాశీలకంగా పనిచేసి, పార్టీ కి మరియు అధినేతకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం ని సాలువతో పిన్నింటి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
DNB News