DNB News - తెలంగాణ / : వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చినా, అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి విషమించి మహిళ ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మహిళ మృతితో ఆగ్రహానికి గురైన బంధువులు, స్థానికులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Admin
DNB News