DNB News - తెలంగాణ / ఖమ్మం : ప్రెస్ మీట్.. ఖమ్మం ప్రెస్ క్లబ్.. ```నా జేసీబీ ని అక్రమంగా పోలీస్ స్టేషన్ లో తరలించరు.. న్యాయం కొరకు``` ఖమ్మం- ప్రెస్ క్లబ్:22-01-2026 చింతకాని పోలీస్ వాళ్ళు నా జేసీబీ ని ఎలాంటి నోటీస్ లేకుండా నా జేసీబీ ని అక్రమంగా పోలీస్ స్టేషన్ కి తరలించారు.. నేను చింతకాని పోలీస్ స్టేషన్ కి ఎన్నో సార్లు వెళ్లిన కూడా వాళ్ళనుండి ఎలాంటి స్పందన లేదు.చింతానిప్పు సత్యం అనే బాధితుడు పైగా ఖమ్మం ప్రెస్ క్లబ్ ని ఆశ్రయించాడు. నీపై వారెంట్ ఉంది అని నా జేసీబీ బండి కోసం వెళ్తే నేను బలవంతంగా కోర్టు కి పంపించారు.. నన్ను కావాలని వైరా పోలీస్ ద్వారా కూడా వైరా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టించి నన్ను భయబ్రాంతులకు గురి చేసి నన్ను మానసికం వేదిస్తున్నారు, కారణం అడిగిన కూడా సమాధానం చెప్పడం లేదు. నా బండి ని పంచనామాని కూడా చేయమని అడిగిన చింతకాని పోలీసులు పంచనామా చేయకుండా, ఇప్పటికి 5సంవత్సరాలనుండి నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. నా జేసీబీ మొత్తం తుప్పుపట్టి ఉన్నది.. నా జేసీబీ ఎందుకు చింతకాని పోలీసులు ఇవ్వడం లేదు, FIR చేసి పంచనామా. అసలు వైరా పోలీస్ కి ఎం సంబంధం? నాకు న్యాయం కావాలి అని ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బాధితుడు తన బాధను చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు.. నా జేసీబీ ని చింతకాని పోలీస్ స్టేషన్ లో అక్రమంగా ఉంచడం పై నాకు న్యాయం కావాలి అని తన బాధని ఎవరికీ చెప్పుకోవాలో అర్ధం కాక విలేకరుల సమావేశం లో తన చెప్పుకుంటున్న అని బాధితుడు వాపోయాడు
Admin
DNB News