Monday, 15 June 2026 01:59:47 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయానికి ప్రయత్నిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Date : 06 March 2026 10:36 AM Views : 72

DNB News - తెలంగాణ / : సీసీఎస్ ప్రత్యేక క్రైమ్ టీమ్ మరియు అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 72 గ్రాముల ఎండీఎం డ్రగ్‌తో పాటు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులు జోగ్ సింగ్, చునారాం చౌదరి, అమృత్ పురోహిత్‌లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా రాజస్థాన్‌కు చెందినవారే కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తూ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితులు బషీర్‌బాగ్‌లోని బీజేఆర్ విగ్రహం వద్ద ఎండీఎం డ్రగ్‌ను గ్రాముకు 6 వేల నుంచి 8 వేల రూపాయల వరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ప్రత్యేక బృందం వారిని పట్టుకుంది. సింథటిక్ మాదక ద్రవ్యం అయిన ఎండీఎం వినియోగం, విక్రయం, కొనుగోలు మరియు రవాణా పూర్తిగా చట్టవిరుద్ధమని పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని.. ఎవరైనా మాదక ద్రవ్యాలతో పట్టుబడితే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆపరేషన్‌ను డీసీపీ చైతన్య కుమార్ మార్గదర్శకత్వంలో, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ బిక్షపతి మరియు వారి సిబ్బంది అబిడ్స్ పోలీసులతో కలిసి విజయవంతంగా నిర్వహించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :