DNB News - తెలంగాణ / : స్థానిక నరసింహపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ మరియు కోదండ రామస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో కంటి శస్త్రచికిత్స శిబిరం లో. 250 మంది హాజరై వారిలో 100 మంది కంటి శస్త్ర చికిత్సకు ఎంపికైనారు వారికి లయన్స్ క్లబ్ సూర్యాపేట కంటి ఆసుపత్రి నందు మంగళవారము మరియు బుధవారం ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయనున్నట్లు నిర్వాహకులు మరియు గ్రామ సర్పంచ్ వేమూరి సత్యనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో. నిరంతరం కొనసాగిస్తానని. వారికి అవసరమైన సహకారం అందిస్తూ. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం. స్వచ్ఛంద సంస్థల. సహకారం తీసుకుంటామని అన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ డాక్టర్ సుబ్బారావు గారు స్వచ్ఛంద సంస్థల శస్త్ర చికిత్స శిబిరాలు ప్రజలకు అందుబాటులో ఉండడం వారికి సర్జరీలు ఉచితంగా చేయించడం అభినందించిన తగ్గ కార్యక్రమం అని ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ అర్హత కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలని .. వేల రూపాయలు ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్లను లయన్స్ క్లబ్ వారు ఉచితంగా నిర్వహించడం అభినందనీయమని. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకుల్ని అభినందించారు. అలాగే గ్రామ సర్పంచ్ వేమూరి సత్యనారాయణ. గ్రామ అభివృద్ధితోపాటు ప్రజల ఆరోగ్యం కోసం. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని. ప్రజలకు అవసరమైన సేవలు అందించడం శుభ పరిణామం అని అన్నారు అలాగే ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి. వేమూరి సత్యనారాయణ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో. కట్టకొమ్ము గూడెం సర్పంచ్ వేమూరి సతీష్. ఆర్లెగూడెం సర్పంచ్ గొర్రె సమత నాగరాజు. నర్సింహా పురం గ్రామ ఉప సర్పంచ్ రెడ్డబోయిన ప్రశాంత్. పాలక వర్గ సభ్యులు. లయన్స్ క్లబ్ చైర్మన్ దోసపాటి గోపాల్ ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్ కంటి నిర్వాహకులు స్వాతి. సిబ్బంది మరియు స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ నీలా సత్యనారాయణ. ప్రధాన కార్యదర్శి. చారు గండ్ల .ప్రవీణ రాజశేఖర్ ఓరుగంటి కిట్టు యాదా సుధాకర్ వంగవీటి రంగారావు కొండ్లె రవికుమార్ బొగ్గారపు రామ్మూర్తి పైడిమర్రి సుధాకర్ చీదళ్ల హనుమంతరావు పత్తి నరేందర్ దేవరశెట్టి శంకర్రావు. గ్రామపంచాయతీ సిబ్బంది. గ్రామ పెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Admin
DNB News