DNB News - తెలంగాణ / : తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 26 తర్వాత సమ్మెకు దిగుతామని RTC JAC హెచ్చరించడంతో ప్రభుత్వం స్పందించింది. రేపు HYDలోని అంజయ్య భవన్లో చర్చలకు రావాలని సంస్థ ప్రతినిధులు, JACప్రతినిధులను ఆహ్వానించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంస్థలోకి యూనియన్ల అనుమతి, 2021, 2025 జీత భత్యాల సవరణ, డ్రైవర్లు, కండక్టర్ల ఉద్యోగ భద్రతపై మార్గదర్శకాలు, బకాయిలను విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
Admin
DNB News