Wednesday, 17 June 2026 06:38:04 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

దేశ యువత రాజకీయాల్లోకి రావాలి

Date : 24 February 2026 05:01 PM Views : 71

DNB News - తెలంగాణ / : భారతదేశంలో ప్రజల మధ్య విబేధాలు సృష్టించి, విచ్చిన్నం ద్వారా రాజ్య పాలన చేయాలని,భారతదేశంలో నివసించాలంటే ఆర్ఎస్ఎస్ అనుమతి అవసరం అనేలా నీచ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్న మోడీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా దేశ పౌరులంతా సంఘటితంగా ఉద్యమించాలని,దేశ యువత రాజకీయాల్లోకి రావాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ. నర్సింహా పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యవర్గ సమావేశం హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ లో జరిగింది. ఈ సమావేశం ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ. నర్సింహా మాట్లాడుతూ నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని బీజేపీ ఎన్నికల ముసాయిదాలో ప్రకటించారు, కానీ మోదీ మూడో సారి అధికారంలోకి వచ్చినా ఇప్పటికి ఆ హామీ అమలు కాలేదని, తాను చెప్పిన ఏటా 2 కోట్ల ప్రకారం ఇప్పటికి 12సంవత్సరాల కాలంలో 24కోట్ల ఉద్యోగాలు భర్తీ కావాలని, మోడీ మాటలన్నీ నీటి మూటలేనని వారు ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బలవంతంగా దేశంలో మత ఉన్మాదం అనే కాషాయ విష బీజాలను విద్యార్థులు, యువత మెదలల్లో చొప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.అందుకే ఈ మధ్య కాలంలో చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తున్నారని, ఇవి సమాజానికి హానికరమని, దేశ ప్రజలు చరిత్రను అధ్యయనం చేయాలని అన్నారు.మోదీ అనేకసార్లు తనలా యువత తయారుకావాలని అంటున్నారు, కానీ మోదీలా మారాలంటే దేశ సమైక్యతను దెబ్బతీసే విధానాలను అనుసరించి మత ఉన్మాద రాజకీయాలను ప్రోత్సహించడమేనని, ఈ విధానాలను దేశ యువత అంగీకరించడానికి సిద్ధంగా లేరని వారు ఉద్ఘాటించారు. అందుకే ఏఐవైఎఫ్ యువతను మంచి సమాజం వైపు సన్నద్ధం చేయడానికి కృషి చేస్తున్నదని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజాస్వామ్యయుతంగా అమలు కొరకు పోరాటాలను ఉదృతం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్,ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బిజ్జ శ్రీనివాసులు, టి.సత్య ప్రసాద్, పేరబోయిన మహేందర్, యుగంధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ మహమూద్, సల్మాన్ బేగ్, పి.శివ కుమార్, ఎల్లంకి మహేష్,మార్కపూరి సూర్య, మానస్ కుమార్, సురేందర్,మస్క సుధీర్, వెంకటేష్, మధుకర్, జెట్టి శ్రీను,శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలుపొందిన AIYF పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మార్కపూరి సూర్య ను CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఈటీ. నర్సింహా గారు శాలువా,మెమెంటోతో అభినందించడం జరిగింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: