DNB News - తెలంగాణ / : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మూసాపేట్‌లో కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న మురళి 18 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మురళిని రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. లంచం తీసుకున్న నగదును స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఇదే కార్యాలయంలో ఒకే నెల రోజుల వ్యవధిలో ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు ఏసీబీకి చిక్కడం సంచలనంగా మారింది. ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయంలో అవినీతి వ్యవహారాలపై అధికారులు మరింత దృష్టి సారించారు.
Admin
DNB News