Wednesday, 22 April 2026 03:39:28 PM
# పత్తికొండలో OHSR ట్యాంక్ పరిశీలన – నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి... # ఎన్.టి.ఎల్. సంస్థ ఆధ్వర్యంలో ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 19000/ వేలరూపాయల నిత్యవసర సరుకులు అందజేత # నంద్యాలలో SDPI లీడర్స్ కాన్క్లేవ్ – ఆదోని యూనిట్ చురుకైన భాగస్వామ్యం.. # చైన్ స్నాచింగ్ కేసు ఛేదన – నిందితుడి అరెస్ట్, పల్సర్ బైక్ స్వాధీనం.. # జొన్నగిరి సమీప గోల్డ్ మైన్స్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి... # పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి # ట్రినిటీ ది స్కూల్ ఆఫ్ లెర్నింగ్, సాలెహ్‌నగర్, కరీంనగర్ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ విజయవంతంగా నిర్వహణ # సిద్ధమైన ఉర్దూ గర్ల్స్ కాలేజీ ప్రారంభం ఎప్పుడు? విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?”.. SDPI.. # శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సంస్థాగత నిర్మాణాల వెరిఫికేషన్ ప్రక్రియ మరియు సమీక్ష సమావేశo # శాతవాహనలో “అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం # మొక్కజొన్న వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ప్రారంభం # కరీంనగర్‌లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం # కరీంనగర్‌లో ఘనంగా కార్తికేయ జువెలరీస్ ప్రారంభోత్సవం అజ్మత్పుర # ఇంటర్ ఫలితాల్లో మైనారిటీ గురుకుల విద్యార్థులకు మెరుగైన ఫలితాలు . # ఆలూరులో చంద్రబాబు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహణ.. # కారుణ్య నియామకాలతో అభ్యర్థులకు ఉద్యోగ భద్రత... # వెంకట్రాంపురం గ్రామపరిధిలోని ఎస్.ఎం.పేట చలివేంద్రం ఘన ప్రారంభం...! # అమెరికా - ఇరాన్ మధ్య రెండో దశ శాంతి చర్చలు # కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష # పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు అడ్డుకట్ట… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ

పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు అడ్డుకట్ట… స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ

Date : 20 April 2026 05:36 PM Views : 5

DNB News - తెలంగాణ / : పారిశుధ్యం ప్రాధాన్యంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులకు ముందస్తుగా అడ్డుకట్ట వేయవచ్చని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డెంగ్యూ,మలేరియా వ్యాధుల నియంత్రణపై ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత మండల ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లాలో వెక్టర్ బార్న్ ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. జిల్లా అధికారులు ఫీల్డ్ సందర్శనలు నిర్వహించే సమయంలో ఎక్కడైనా పారిశుధ్యం మెరుగుపరచాల్సిన అవసరం ఉంటే వెంటనే సంబంధిత పంచాయతీ లేదా మున్సిపాలిటీ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దోమలు నీటిలో పెరుగుతాయని, ఎక్కడా నీటి నిల్వలు ఉండకూడదని, తాగునీటి లీకేజీలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న పొదలను తొలగించి దోమల పెరుగుదలకు అవకాశం ఇవ్వకూడదన్నారు. ప్రజల్లో పారిశుధ్యంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టి వెక్టర్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని, మలేరియా, డెంగ్యూ కేసులను వెంటనే గుర్తించి చికిత్స అందించాలనిసూచించారు. ప్రతి గ్రామంలో మే నెలలోనే ఆయిల్ బాల్స్ సరిపడా నిల్వ ఉంచాలని, మండల స్పెషల్ అధికారులు తమ పర్యటనల్లో వాటి నిల్వలను తనిఖీ చేయాలని ఆదేశించారు. పి.హెచ్‌.సీ స్థాయిలో అవసరమైన టెస్ట్ కిట్లు, మందులు సిద్ధంగా ఉంచాలని, దీనికి డీఎంహెచ్ఓ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదయ్యే డెంగ్యూ కేసులను తప్పనిసరిగా నోటిఫై చేయాలని, ఆ ప్రాంతాల్లో తక్షణ పారిశుధ్య చర్యలు, టెస్టింగ్ నిర్వహించాలని సూచించారు. జిల్లాలో జరుగుతున్న నిర్మాణ పనులు, ప్రాజెక్ట్ ప్రాంతాలను పరిశీలించి దోమల పెరుగుదలకు అనుకూలమైన ప్రదేశాలను గుర్తించి ఆయిల్ బాల్స్ వినియోగించాలనీ సూచించారు. గత చరిత్ర ఆధారంగా గుర్తించిన హాట్‌ స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లలో ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టి పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మిల్లర్లు తప్పనిసరిగా నాణ్యమైన ధాన్యాన్ని స్వీకరించే విధంగా చూడాలని, కొనుగోళ్లలో ఏవైనా సమస్యలు తలెత్తిన వెంటనే తమ దృష్టికి తీసుకొని రావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పద్మశ్రీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు, డిపిఓ రాంబాబు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :