Monday, 15 June 2026 02:25:15 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

శాతవాహనలో “అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమం

Date : 21 April 2026 09:41 AM Views : 35

DNB News - తెలంగాణ / : శాతవాహన విశ్వవిద్యాలయంలో ప్రగతి పథంలో తెలంగాణ అగ్నిమాపక శాఖ సంసిద్ధత అనే అంశంపై తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ & సివిల్ డిఫెన్స్ శాఖ, నిర్వహించిన అగ్నిమాపక భద్రత వారోత్సవాల లో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరగగా మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలను నివారించడానికి భవిష్యత్తు ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అందరూ సంసిద్ధులై ఉంటేనే ప్రమాదాలను నివారించవచ్చని తెలియజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ మన విశ్వవిద్యాలయాన్ని అగ్ని ప్రమాదాల నుండి కాపాడుకోవడానికి మనమే నడుం బిగించుకోవాలని ప్రత్యేకంగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి వివిధ రకాల జంతువులను రక్షించడానికి ప్రమాదాల నివారణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని గత సంవత్సరం కొన్ని వన్యప్రాణులు కార్చిచ్చు వల్ల చనిపోవడం చాలా బాధ కలిగించిందని అందువల్లనే మిషన్ భగీరథ పైప్లైన్ సాయంతో విశ్వవిద్యాలయంలోని అన్ని ప్రధాన కళాశాలల వద్ద వాటర్ పాయింట్స్ పెట్టామని దీనివలన అగ్ని ప్రమాదాలను కొంతవరకు నివారించడం సులభమవుతుందని తెలియజేస్తూ రెండవ ఫైర్ స్టేషన్ ని కూడా కరీంనగర్లో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో వసతి గృహాలలో కానీ ప్రయోగశాలలో కానీ విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాలని ముందస్తు జాగ్రత్త తోనే మనం ప్రమాదాలను నివారించవచ్చని తెలియజేస్తూ భారతదేశంలో ప్రతిరోజు 35 మంది అగ్ని ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారని అందులో 80% హానికరమైన పొగ రసాయనిక మిశ్రమాల వలన ఊపిరాడక చనిపోతున్నారని దీనిపై అవగాహన చాలా అవసరమని తెలియజేస్తూ వివిధ రకాల అగ్ని ప్రమాదాలకు సంబంధించిన జాగ్రత్తలను గురించి, వాటిని ఎదుర్కోవడానికి కావలసిన మెలకువలను గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలోఅతిథులుగా డా. డి.హరికాంత్ ఓ ఎస్ డి టు వి సి, డా. ఎస్. రామకాంత్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్, డా. కె. పద్మావతి ఆర్ట్స్ లా కళాశాల ప్రిన్సిపల్ పాల్గొని ప్రమాదాల విపత్తు నివారణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సైన్స్ కళాశాల అధ్యాపకులు ఆర్ట్స్ కళాశాల అధ్యాపకులు కామర్స్ కళాశాల అధ్యాపకులతో పాటు మూడు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని అవగాహన పెంచుకున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :