DNB News - తెలంగాణ / : మునగాల: మండల పరిధిలోని బరాకత్‌గూడెం గ్రామంలోని ఎస్సీ మాదిగల పాత స్థలంలో ప్రస్తుతం శిధిలావస్థకు చేరుకున్న కమ్యూనిటీ హాల్ భవనాన్ని తొలగించి, అదే స్థలంలో నూతన కమ్యూనిటీ హాల్‌ను G+1 విధానంలో నిర్మించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో డి.పి.ఓ,కి వినతిపత్రంఅందజేశారు.ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్ మునగాల మండల అధ్యక్షులు గుడిపాటి కనకయ్యమాదిగ,మాట్లాడుతూ,గ్రామంలోని మాదిగ సామాజిక వర్గ ప్రజలకు సమావేశాలు,సామాజిక కార్యక్రమాలునిర్వహించుకునేందుకు అనువైన కమ్యూనిటీ హాల్ అత్యవసరమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న భవనం పూర్తిగా శిధిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారిందని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే పాత భవనాన్ని డీ-ప్లాంటేషన్ చేసి ఆధునిక సదుపాయాలతో కొత్త భవనాన్ని నిర్మించాలనికోరారు.ఈకార్యక్రమంలో మాజీవార్డు సభ్యుడు నూకపంగు రాంబాబు మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News