DNB News - తెలంగాణ / : సంక్రాంతి పండుగ సందర్భంగా అంబర్‌పేటలోని బతుకమ్మకుంట చెరువు వద్ద జరిగిన కార్యక్రమాలకు సంబంధించి రంగనాథ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. రంగనాథ్ పై కోర్టు ధిక్కరణ చర్యలు ఇంకా పెండింగ్లో ఉన్న విషయాన్ని, గత విచారణ సందర్భంగా క్షమాపణ కోరిన విషయాన్ని గుర్తు చేసిన న్యాయస్థానం.. బతుకమ్మకుంట చెరువు వద్ద నిర్వహించిన సమావేశానికి హాజరై.. జిమ్ ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలతో సహా ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రంగనాథ్ హామీ ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డ న్యాయస్థానం.. బతుకమ్మ కుంట భూ వివాదంపై గతేడాది జూన్ 12న హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ.. ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించినందున కమిషనర్ రంగనాథ్ పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ భూ హక్కులు కోరుతున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు.. ఈ పిటిషన్ పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్ రావు ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టిన నైపథ్యంలో.. కోర్టు పరిధిలోని ప్రాంతాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎలా సందర్శిస్తారని, సమావేశాలు నిర్వహించి, ప్రసంగాలు చేయడానికి తనకే పూర్తి అధికారం ఉన్నట్టుగా బహిరంగ ప్రకటనలు ఎలా చేస్తారని ప్రశ్నించిన న్యాయస్థానం..!!
Admin
DNB News