DNB News - తెలంగాణ / : మాజీ శాసనసభ స్పీకర్ దివంగత స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాద రావు జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం తో పాటు నగరంలో పలుచోట్ల ఘనంగా జరిగినాయి. ముందుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. అనంతరం బస్టాండ్ కూడలి వద్ద ప్రభుత్వం తరఫున ఆర్డీవో మహేష్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎండి తాజ్, కొరివి అరుణ్ కుమార్, కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, పర్వత మల్లేశం, వరాల నర్సింగం, గుమ్మడి రాజ్ కుమార్, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు. అనంతరం కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ... అజాతశత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వపరంగా కూడా పెద్ద ఎత్తున జయంతి వేడుకలను నిర్వహించడం జరిగిందని, వారు ఉమ్మడి రాష్ట్రానికి కాక ప్రతి ఒక్క ప్రాంతానికి సేవలు చేస్తూ, అజాత శత్రువుగా అందరి మన్ననలు పొందినారని, పలువురికి ఆదర్శంగా నిలిచినారని వారు చూపిన బాటలో పయనిస్తామని ప్రతిన భూనుతు, వారి మరణాంతరం వారి తనయుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు వారి ఆశయాలను కొనసాగిస్తూ, వారు చూపిన బాటలో నడుస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరుపొందినారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెన్న రాజ మల్లయ్య , గుండాటి శ్రీనివాస్ రెడ్డి, టేల భూమయ్య, ఆకుల ఉదయ్, ,మంద నగేష్ ముదిరాజ్, మూల కృష్ణారెడ్డి,వంగల విద్యాసాగర్, విక్టర్, నాగుల సతీష్, చెర్ల పద్మ, పంజాల స్వామి గౌడ్ , దిండుగాల మధు, మూల జయపాల్ , మాదాసు శ్రీనివాస్,సత్తినేని శ్రీకాంత్, శిల్ప, జ్యోతి రెడ్డి, రాచర్ల పద్మ, లాయి, అబ్దుల్ భారీ, కుంభాల రాజ్ కుమార్, బషీరుద్దీన్, మూల జయపాల్, కాంపల్లి కీర్తి కుమార్, ఎర్ర శ్రీనివాస్, స్వప్న శ్రీ, ముక్క భాస్కర్ శ్రీరాముల రమేష్, దండు రవీందర్, సలీముద్దీన్, సిరికొండ శివప్రసాద్, జొన్నల రమేష్, కొట్టే ప్రభాకర్, మామిడి సత్యనారాయణ రెడ్డి, రూపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సుంకరిగణపతి, ఊరడి లత, ములకల కవిత, మార్కరాజు, ఫజల్, అందే శంకర్, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News