Wednesday, 17 June 2026 03:59:11 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఎస్ఆర్ఆర్ లో వీ హబ్ వారి మౌలిక యూత్ ఇన్నోవేషన్ కార్యక్రమం

Date : 26 February 2026 10:36 AM Views : 95

DNB News - తెలంగాణ / : స్థానిక ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి డిగ్రీ కళాశాలలో గ్రాస్రూట్స్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం మహిళా సాధికారత విభాగ ఆధ్వర్యంలో, వి హబ్ సహకారంతో నాలుగు రోజుల పాటు నిర్వహించబడనున్న ఐలీప్ – గ్రాస్రూట్స్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థినులను ఉద్యోగావకాశాలకు సిద్ధం చేయడం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, డిజిటల్ పరిజ్ఞానం, ఆర్థిక అవగాహన, రెజ్యూమే తయారీ మరియు ఇంటర్వ్యూ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్ ప్రిన్సిపాల్ నితిన్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు వృత్తి పరమైన నైపుణ్యాలను అలవరచుకోవడానికి ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. రాజయ్య యువతలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించడంలో ఐలీప్ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. స్టాఫ్ క్లబ్ కార్యదర్శి డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసానికి దోహదపడటమే కాకుండా కళాశాల స్థాయిలో సానుకూల విద్యా వాతావరణాన్ని నెలకొల్పుతాయని తెలిపారు. విద్యార్థులు సమయపాలన, క్రమశిక్షణ, జట్టు భావన వంటి విలువలను అలవరచుకుని తమ భవిష్యత్‌ను విజయవంతంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మహిళా సాధికారత సెల్ సమన్వయకర్త డా. ఎం. అర్చన కార్యక్రమ లక్ష్యాలను వివరించి, నాలుగు రోజుల పాటు మెంటర్ల మార్గదర్శకత్వంలో ప్రాయోగిక శిక్షణ, అసైన్‌మెంట్లు మరియు ప్రొఫెషనల్ ప్రొఫైల్ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రాజెక్ట్ మేనేజర్ జి. శివకుమార్ విద్యార్థుల్లో జట్టు భావన, ఆవిష్కరణాత్మక ఆలోచన మరియు ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం రూపుదిద్దుకున్నదని చెప్పారు. ప్రాజెక్ట్ అసోసియేట్ శ్రీమతి కె. సౌమ్య లీడర్‌బోర్డ్ విధానం ద్వారా విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించనున్నట్లు వివరించారు. సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ శ్రీమతి సుహిత కమ్యూనికేషన్ నైపుణ్యాలు, రెజ్యూమే నిర్మాణం, ఇంటర్వ్యూ విధానాలు మరియు ప్రొఫెషనల్ ఎటికెట్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులు కెరీర్‌కు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని భవిష్యత్తులో ఇంటర్న్‌షిప్ మరియు ప్లేస్‌మెంట్ అవకాశాలను పొందేలా మార్గనిర్దేశం చేయబడతారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: