DNB News - తెలంగాణ / : హైదరాబాద్ దశాబ్దాల ఆర్టీసీ కార్మికుల కల నెరవేర్చిన ప్రజా ప్రభుత్వం రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపిన చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎస్ సి సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించి, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లను నెరవేరుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 11% పీఆర్సీ ప్రకటించడంతో పాటు వారి అన్ని డిమాండ్లను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం చారిత్రాత్మక ఘట్టం అని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ని హైదరాబాద్ లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా కలిసి శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని నేతలు అన్నారు. గత పాలకులు మాటలకే పరిమితమైతే, మా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేతలతో చరిత్ర సృష్టించిందని, ఆర్టీసీ విలీనం, 11% పీఆర్సీ, సంఘాల ఎన్నికలకు అనుమతి ఇవన్నీ కార్మిక పక్షపాత ప్రభుత్వానికి నిదర్శనం అని దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కింది అని కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఆర్టీసీ కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని పేర్కొన్నారు.
Admin
DNB News