DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం లోని జూపెడ గ్రామంలో ఎస్ వి కంటి హాస్పిటల్ మేనేజ్ మెంట్ దరిపల్లి భాస్కర్ , సీనియర్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ కె.విజయ్ ప్రకాష్ ఫాకో (లేజరు)సర్జన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం నిర్వహించడం జరిగింది ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిధులుగా జూపెడ గ్రామ సర్పంచ్ వనవాసం నరేందరరెడ్డి , ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్స్, ఆ గ్రామ పెద్దలు , నాయకులు ,ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా డాక్టర్ విజయ్ ప్రకాష్ దాదాపు వంద మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు కంటి శుక్లం (క్యాటరెక్ట్)కలవారికి అతి తక్కువ ధరలో ఫాకో (లేజరు) సర్జరీ లు చేస్తామని ఎస్.వి.కంటి హాస్పిటల్ బాధ్యులు దరిపల్లి భాస్కర్ రావు డి.ఉత్తేజ్ ఆ గ్రామ ప్రజలకి తెలియజేశారు. ఈ సందర్బంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ దరిపల్లి భాస్కర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా లోని నలుమూలల ప్రాంతాలకి చెందిన పేద ప్రజలు ఎవరైనా కంటి సమస్స్య లు కలిగిన చిన్న పిల్లలు , యువకులు, వృద్ధులు ఎవరైనా ఉంటే తక్షణమే ఖమ్మం మయూరి సెంటర్ లోగల మా ఎస్ వి కంటి హాస్పిటల్ కి వచ్చి డాక్టర్ గారికి చూపించుకొని అతి తక్కువ ధరకే కంటి ఆపరేషన్ లు చేయించు కోగలరని ప్రజలకి చూచించారు ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ వనవాసం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు అనుకూలంగా ఎస్ .వి.కంటి హాస్పిటల్ వారు పేద వారికి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ బి.రాజశేఖర్ వార్డ్ మెంబర్లు జి.ప్రభాకర్ రెడ్డి ఎల్. శ్రీకాంత్ గ్రామ పెద్దలు టి.శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ రెడ్డి ,మల్లారెడ్డి, రగునాదరెడ్డి బి.మంగయ్య బి.వెంకన్న ఎం.మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News