DNB News - తెలంగాణ / : ఈ నెల 21న శనివారం నాడు జరిగే కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. : తిరుమలాయపాలెం మండల సభ ప్రచార కమిటీ కన్వీనర్ గుగులోత్ సురేష్ నాయక్ తిరుమలాయపాలేం: పాలేరు నియోజకవర్గస్థాయి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను కుసుమంచి కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న సేవలాల్ మహారాజ్ భవన స్థలం వద్ద శనివారం 21వ తారీకున జరిగే విజయోత్సవ కార్యక్రమాన్నీ విజయవంతం చేయాలని తిరుమలాయపాలెం మండల ప్రచార కమిటీ కన్వీనర్ గుగులోతు సురేష్ నాయక్ కోరారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి వర్యులు శ్రీ పోంగులేటీ శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.కావున నియోజకవర్గ పరిధిలోని గిరిజన సహోదరులు మరియు తిరుమలాయపాలెం మండల పరిధిలోని అన్ని గ్రామా పంచాయతీలో ఉన్న లంబాడ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సేవలాల్ మహారాజ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
Admin
DNB News