DNB News - తెలంగాణ / : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని మంగళవారం కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే మహత్తర విలువలను మన రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన మార్గం సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకులు నర్మద నరసన్న, పడాల శ్రీజ అజయ్ నాయకులు గసికంటి కుమార్ వేల్పుల వెంకటేష్ గండి గణేష్, గండి శ్యామ్, మేడి అంజయ్య తీట్ల ఈశ్వరి, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Admin
DNB News