DNB News - తెలంగాణ / : విల్సన్ గార్డెన్ ప్రాంతానికి చెందిన రషీద్ పాషా (45)… స్థానిక గూండాల దాడిలో మృతి చెందాడు. సమాచారం ప్రకారం… కొత్తగా గ్యారేజ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న రషీద్ పాషా వద్ద నుంచి హఫ్తా (ప్రొటెక్షన్ మనీ) ఇవ్వాలని కొందరు దుండగులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆయన డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో… బ్యాట్‌తో దారుణంగా కొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన విల్సన్ గార్డెన్ ప్రాంతంలో చోటుచేసుకోవడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి… నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హఫ్తా కోసం హత్యకు పాల్పడిన ఈ ఘటన నగరంలో నేరాల పరిస్థితిపై మరోసారి చర్చకు దారి తీసింది.
Admin
DNB News