DNB News - తెలంగాణ / : కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (ఒక రోజు) పాటు నగరంలోని అనేక హోటళ్లు బంద్ చేయాలని పిలుపునిచ్చింది. హోటళ్లకు అవసరమైన కమర్షియల్ గ్యాస్‌ను కంపెనీలు నిలిపివేయడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అసోసియేషన్ తెలిపింది. గ్యాస్ లేకపోవడంతో వంట చేయడం అసాధ్యమైందని, అందుకే నిరసనగా హోటల్స్ మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో బెంగళూరులో భోజనం కోసం హోటళ్లపై ఆధారపడే వేలాది మందికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని హోటల్ యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
Admin
DNB News