DNB News - తెలంగాణ / : జాతీయ డెంగ్యూ నివారణ డే ను సందర్భంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రం రేపాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అవగాహణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి డాక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ సమాజంతో మమేకమై -డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశ కార్యకర్తలకు ,అరోగ్య సిబ్బందికి సూచించారు. వారు మాట్లడుతూ డెంగ్యూ వైరస్ వ్యాధిని హాని కలిగించే ఎడిస్ ఇజాప్ట్టై (టైగర్)దోమ మన ఇంటి పరిసరాలలో చిన్న చిన్న పాత్రలలో స్థావరం ఏర్పాటు చేసుకొని పగటి పూట కుట్టడం జరుగుతుందని తెలిపారు. వారానికి ఒక సారి ఇంటి పరిసరాల్లో లార్వా ( తొక పురుగులు) లేకుండా చేసుకోవాలని, దోమ తెరలు వాడాలని, కిటికీలకు జాలిలు బిగించాలని, ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ సునీత , ఫార్మసీ ఆఫీసర్ శాంతయ్య, ల్యాబ్ టెక్నీషియన్ ఫణీంద్ర, ఆశాలు జ్యోతి రమణ పాల్గొన్నారు.
Admin
DNB News