DNB News - తెలంగాణ / : కేరళలో ఓ ఇంట్లో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న ఏసీ నుంచి ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా ఐదు పాములు బయటపడటంతో ఇంటి యజమాని తీవ్రంగా భయాందోళనకు గురయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే… Sreekaryam, Thiruvananthapuram ప్రాంతంలో మాధవ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నివసిస్తున్నాడు. ప్రతిరోజులానే కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన మాధవ్ ఫ్రెష్ అయ్యేందుకు బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు. అయితే గోడకు అమర్చిన ఏసీ కింద ఏవో కదులుతున్నట్టు కనిపించడంతో దగ్గరగా వెళ్లి పరిశీలించాడు. అప్పుడు ఏసీ నుంచి చిన్న చిన్న శబ్దాలు వినిపించడంతో అనుమానం వచ్చిన మాధవ్ ఒక కర్రతో కాస్త జరిపి చూసాడు. దీంతో ఏసీ లోపల పాములు ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే ఫోన్ ద్వారా సర్ప యాప్ ద్వారా స్నేక్ క్యాచర్ మరియు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని ఏసీ టెక్నీషియన్ సహాయంతో ఏసీ కవర్‌ను తెరిచి పరిశీలించగా లోపల ఐదు పాములు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం దాదాపు గంటకు పైగా శ్రమించి ఏసీ లోపల ఉన్న నాలుగు పాములను బయటకు తీశారు. అయితే మరో పాము ఏసీ పైప్ ద్వారా బయటకు వెళ్లిపోయినట్లు స్నేక్ క్యాచర్ తెలిపారు.
Admin
DNB News