DNB News - తెలంగాణ / : MRPS అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గత మూడు నెలలుగా రాజీలేని పోరాటం చేయడం వల్లనే కర్ల రాజేష్ లాకప్ డెత్ కారకులైన ఎస్ఐ, సిఐల మీద కేసు నమోదు కాబడిందని, అలాగే సీఐని సస్పెండ్ చేసి ఎస్ఐ ఎస్పీ ఆఫీసుకు అటాచ్ చేయడం జరిగిందని మరియు రాజేష్ కుటుంబానికి 4.12 లక్షల రూపాయల పరిహారం, ఇల్లు , ప్రభుత్వ ఉద్యోగం లభించాయని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా.గోవిందు నరేష్ మాదిగ అన్నారు. కోదాడ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ " కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసును నీరుగార్చాలని , నిర్వీర్యం చేయాలని అనేక కుట్రలు కుతంత్రాలు జరిగాయని అన్నారు. అయినప్పటికీ ప్రతి కుట్రను ఛేదించి సమాజం ముందు అనేక సాక్షాదారాలను బయటపెట్టి కర్ల రాజేష్ కేసులో న్యాయం జరిగే విధంగా మందకృష్ణ మాదిగ పోరాటాన్ని ముందుకు నడిపించారని అన్నారు. ఈ పోరాట ఫలితంగానే జాతీయ ఎస్సీ కమిషన్ కేసును స్వీకరించిందని,విచారణ జరిపి తక్షణమే న్యాయం అందించాలని ప్రభుత్వాన్ని, పోలిసు ఉన్నతాధికారులను ఆదేశించింది అని అన్నారు. జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ కూడా కేసు స్వీకరించి విచారణ చేస్తున్నాయని అన్నారు.న్యాయం ఎక్కడ దాగి ఉన్న వెతికి తీసుకురావాలనే సంకల్పంతో రాజ్యాంగబద్ధంగా ఉన్న అన్ని వ్యవస్థలను సంప్రదించి వాటిని కదిలించడం జరిగిందని అన్నారు. ఆ ప్రక్రియలోనే రేపు కర్ల రాజేష్ డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం జరుగుతుందని అన్నారు.రేపు 27 వ తేదీన ఉదయం 10 గంటలకు బీబీనగర్ ఎయిమ్స్ వైద్యులు రాజేష్ డెడ్ బాడీకి రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ ప్రక్రియను పరిశీలించడానికి మంద కృష్ణ మాదిగ కూడా వస్తున్నారని తెలిపారు. రీ పోస్టుమార్టం జరుగుతున్న నేపథ్యంలో తీవ్రమైన దుఃఖంలో ఉన్న కర్ల లలితమ్మ కుటుంబానికి అండగా ప్రతి ఒక్కరూ ఉండాలని పిలుపునిచ్చారు. కర్ల రాజేష్ లాకప్ డెత్ ప్రధాన కారకుడైన చిలుకూరు ఎస్సైగా వ్యవరించిన సురేష్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనలో సంపూర్ణమైన న్యాయం జరిగేంతవరకు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పోరాటం కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డా.గోవిందు నరేష్ మాదిగ MRPS రాష్ట్ర అధ్యక్షులు బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ MRPS, MSP సూర్యాపేట జిల్లా ఇన్చార్జి ఏపూరి రాజు మాదిగ MRPS సూర్యాపేట జిల్లా కన్వీనర్, MSP రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు, యలమర్తి రాము, వడ్డేపల్లి కోటేష్ , MRPS, MSP, MSF జిల్లా మరియు మండల అధ్యక్షులు , పట్టణ నాయకులు, MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు , బచ్చలకూరి ప్రసాద్ , సిద్దెల శ్రీను, లంజపల్లి శ్రీను, పిడమర్తి చిన్న వెంకట్రావు, మల్లెపంగు సూరి, గుడిపాటి కనకయ్య, కొండపల్లి సూర్యప్రకాష్, ఆకారపు కొండలు, పందింటి నవీన్, యలమర్తి ఉపేందర్, కర్ల శివ , కర్ల ప్రేమ్ , కర్ల కమల్, దాసరి రవి, కందుకూరి ఉపేందర్, రోహిత్ , అవినాష్ తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News