DNB News - తెలంగాణ / : ఇటీవల జరిగిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 25వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికైన కేకే శ్రీనివాస్‌ను ప్రముఖ న్యాయవాది మారపాక రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన సన్నిహితులు మరియు అభిమానులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి ఆయనకు అభినందనలు తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసిమెలిసి మెలిగే మనసున్న నాయకుడిగా కేకే శ్రీనివాస్ పేరుపొందారని వారు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. 25వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని కొనియాడారు. ఈ సందర్భంగా కేకే శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమం లో యర్ర కామేష్, అడ్వకేట్ హరి, బండి భాస్కర్, వేల్పుల భాస్కర్, చదలవాడ సూరి, సెనగ లక్ష్మణ్, మొగలిపాక మురళీకృష్ణ, కనకం సూరిబాబు, పిట్టల సతీష్, కాకటి బాబు, కండె మహేష్, నవీన్, అర్వ కిషోర్, మాటూరి విష్ణు, పోస్ట్ ఆఫీస్ వాసు, కనకం చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News