DNB News - తెలంగాణ / : బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని గడప గడపకు ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యేతాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట :మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన పార్టీ 10 వ వార్డు అభ్యర్థి గెలుపు కై అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ,ముమ్మరంగా గడప గడపకు ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ తిరుగుతూ 10 వ వార్డు అభ్యర్థులైన కోటగిరి కిషోర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా తాటి వెంకటేశ్వర్లు.మాట్లాడుతూ,అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని. అభివృద్ధి కేవలం బి ఆర్ ఎస్ తో సాధ్యమని, మున్సిపాలిటీ పురోభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు,మండల నాయకులు, వార్డు ప్రజలు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కోటగిరి కిషోర్ ను గెలిపించాలని కోరారు.
Admin
DNB News