DNB News - తెలంగాణ / : మునగాల:గ్రామపంచాయితీ కార్మికులను పర్మినెంట్ చెయ్యాలి వేతనాలను పెంచాలని సీఐటీయూ జిల్లాకమిటీసభ్యులు బచ్చలకూర స్వరాజ్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య భవనం లో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబందసంఘం దార రవికుమార్ అధ్యక్షతన జరిగిన మండలకమిటీ సమావేశంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మల్టీపర్పస్ వర్కర్ పని విధానాన్ని రద్దు చేయాలని కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ఆన్లైన్ లో గతంలో నమోదు కాని పేర్లను నమోదు చేయాలని, ప్రభుత్వమే కార్మికుల వేతనాలకు బడ్జెట్ కేటాయించాలని, బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ.పంచాయితీ కార్మికుల మహాధర్నా జూన్ 1 న మండల కేంద్రం వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో జిపి వర్కర్స్ జిల్లాకమిటీసభ్యులు ఎం వెంకటేశ్వర్లు, డి రవికుమార్,టి ముత్తయ్య, టి చంద్రశేఖర్, జె బజార్, ఆర్ వెంకన్న, బి నర్సయ్య, డి రాజు, మల్సూర్, టి కుమారి, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News